చిత్రం: చిన్ననాటి స్నేహితులు (1971) సంగీతం: టి. వి. రాజు గీతరచయిత: సినారె నేపథ్య గానం: సుశీల, ఘంటసాల
పల్లవి:
ఇక్కడే ఈ గదిలోనే.. అప్పుడే ఒకటైనప్పుడే అలివేణి సిగపూలు ఏమన్నవో.. ఈ అలివేణి సిగపూలు ఏమన్నవో తొలిరేయి తెలవారలేనన్నదో.. మరి ఏమన్నదో చెప్పనా... మళ్ళీ.. చెప్పనా చెప్పనా.. మళ్ళీ.. చెప్పనా
చరణం 1 :
శృతి మించెను శ్రీవారి మనసూ.. గడుసైన వయసూ . . ఓ . . ఓ . . ఓ అగుపించెను ఆ నాటి తలపు.. అరుదైన వలపు
నీ ఓర చూపుల మధురిమలు.. నీ దోర నవ్వుల దొంతరలూ అలనాటి రాగాలే పలికించగా.. అలనాటి రాగాలే పలికించగా అనురాగ వీణా నిదురించునా.. నా అనురాగ వీణా నిదురించునా . .
ఇక్కడే ఈ గదిలోనే.. అప్పుడే.. ఒకటైనప్పుడే దొరగారి ఎదపొంగు ఏమన్నదో.. ఈ దొరగారి ఎదపొంగు ఏమన్నదో పరువాలు విరబూసి ఏమన్నవో.. మరి ఏమన్నవో చెప్పవే.. జాబిల్లీ చెప్పవే చెప్పవే.. జాబిల్లీ చెప్పవే
చరణం 2 :
ఇక తీరును ఇన్నాళ్ళ వేడుకా.. ఇల్లాలి కోరికా ఓ... ఓ... ఓ ఉదయించును మన ఇంట భానుడు.. ఒక బాల రాముడు ఓ.. ఓ.. ఓ మీ నోటి పలుకే జీవనయై.. నీ తోటి బ్రతుకే పావనమై అపరంజి కలలన్ని ఫలియించనీ.. నా అపరంజి కలలన్ని ఫలియించనీ అందాల పాపాయి ఉందయించనీ.. ఒక అందాల పాపాయి ఉందయించనీ చిచుల్లల్లల్లల్లల్లల్ల హాయీ.. ల్లల్లల్లల్లల్లల్ల హాయీ.. హాయీ... హాయీ
No comments:
Post a Comment