Friday, December 5, 2014

వలపే వెన్నెలగా

చిత్రం :  గాంధీ పుట్టిన దేశం (1973)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  సుశీల, బాలు 



పల్లవి :



వలపే వెన్నెలగా..  బ్రతుకే పున్నమిగా
జతగా గడిపే చల్లనీ ఈ రేయీ
ఎపుడూ ఇటులే నిలవాలి.. ఈ కలలే నిజమై విరియాలి
వలపే వెన్నెలగా.. బ్రతుకే పున్నమిగా
         




చరణం 1 :



అల్లరి గాలికి నేలకు రాలే మల్లెను దోసిట దాచావు
అల్లరి గాలికి నేలకు రాలే మల్లెను దోసిట దాచావు
అనురాగముతో అల్లిన మాలగ నీ మెడలోనే నిలిపావు
తోడూ నీడా అయినావు 


 
వలపే వెన్నెలగా..  బ్రతుకే పున్నమిగా



చరణం 2 :


సొగసూ మనసూ కానుక చేసి నాలో సగమై నిలిచావు
సొగసూ మనసూ కానుక చేసి నాలో సగమై నిలిచావు
చీకటి వెలుగులు చెరిసగము పంచుకునేవూ.. ఏనాడు ఎదలో ఎదగా ఒదిగావూ  



వలపే వెన్నెలగా.. బ్రతుకే పున్నమిగా జతగా గడిపే చల్లనీ ఈ రేయీ
ఎపుడూ ఇటులే నిలవాలి.. ఈ కలలే నిజమై విరియాలి
వలపే వెన్నెలగా.. బ్రతుకే పున్నమిగా    
 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4004

No comments:

Post a Comment