Saturday, December 6, 2014

శ్రీరామచంద్రా నారాయణా

చిత్రం : బంగారు బాబు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల




పల్లవి :


శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా


శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా



చరణం 1 :



పగలంతా ఇద్దరమూ ఆలుమగలమూ.. పడుకునే వేళకూ పక్కలే దూరమూ
పగలంతా ఇద్దరమూ ఆలుమగలమూ.. పడుకునే వేళకూ పక్కలే దూరమూ


ఊరివారికందమూ వుత్తుత్తి కాపురము..  ఊరివారికందమూ వుత్తుత్తి కాపురము
నోరూరుతున్న మనకేమో ఓపలేని..  తాపము  . .  

అయ్యో..  శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా


చరణం 2 :


అన్ని ఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా.. అన్న మాట కోసమే ఆశలన్ని అణచుకున్నా
అన్ని ఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా.. అన్న మాట కోసమే ఆశలన్ని అణచుకున్నా


ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా . . ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా
కన్నెకున్న హద్దులకు కట్టుబడి..  ఊరుకున్నా
 


శ్రీరామచంద్రా నారాయణా..  ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
అయ్యయ్యో..  శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా



చరణం 3 :



కళ్ళల్లోకి చూడకు.. కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్ళు పడేవరకు మోమాట పెట్టకు
కళ్ళల్లోకి చూడకు.. కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్ళు పడేవరకు మోమాట పెట్టకు


ఆ మంచిరోజు వచ్చును.. హద్దులెగిరిపోవును
మంచిరోజువచ్చును హద్దులెగిరిపోవును
కాచుకున్న వయసు కచ్చి.. అప్పుడే తీరును . .
 

శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా
శ్రీరామచంద్రా నారాయణా.. ఎన్ని కష్టాలు వచ్చాయిరా.. నాయనా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1695

No comments:

Post a Comment