Thursday, December 4, 2014

వస్తా... వెల్లొస్తా

చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల, బాలు 



పల్లవి :


వస్తా... వెల్లొస్తా..  వెల్తుండా..
వస్తా... ఎల్లొస్తా..  మళ్ళెప్పుడొస్తా?
రేపు సందేలకొస్తా.. 


చూస్తా..ఎదురు చూస్తా
చూస్తా.. ఎదురు చూస్తా
జాగు చేస్తే... సగం చస్తా.. రాకపోతే అసలు చస్తా 


వస్తా... ఎల్లొస్తా...  మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా...
రేపు సందేలకొస్తా...
రేపు సందేలకొస్తా...  

చరణం 1 :



వచ్చా.. వచ్చొచ్చొచ్చా..
వచ్చావులే.. మహా
 నీకేం.... ఎవరన్నా చూస్తారని ఎంత హడలి సచ్చా....
ఆ....ఎవరన్నా చూసారా ?
చూడకుండవుంటారా....చుప్పనాతోళ్లు....


పిట్ట చూసి పెట్ట తోటి గుట్టు చెప్పిందీ...  మబ్బు చూసి చందమామను మాట రమ్మందీ
ఆహా.. గాలి చూసి ఈలవేసి గోలచేసిందీ... కాలెనక్కు మనసు ముందుకు లాగిలాగి జాగైంది


వస్తా...ఎల్లొస్తా  మళ్ళెప్పుడొస్తా ?
రేపు సందేలకొస్తా
రేపు సందేలకొస్తా  ....
రేపు సందేలకొస్తా 




చరణం 2 : 



మావా... ఓ మావా... ఏం మ్మా.. కోపమా.. లే.. సంబడం.. వచ్చానుగా
వచ్చావులేమ్మా... చల్లారె ఏళకు
వచ్చావులేమ్మా... చల్లారె ఏళకు..  ఏం సెయ్యను ?


గడప దాటేతలకి నన్ను కామయ్య కాచాడు
నక్కి నక్కి వస్తుంటే నరసయ్య తగిలాడు...  ఏడిశాడు
రావులోరి గుడికాడ రంగయ్య సకిలించాడు
నా గుండె దడ దడ సూడకుండా కోపగిస్తావు...
నువ్వూ.. కోపగిస్తావు... వస్తా...


ఎహె...సూడనియ్యవే మనకేటె బయం
అందరినీ ఓ కంట సూసే దేవుడున్నాడు
ఆడి ముందు రేపే నీకు తాళిగడతాను
మేము ఆలుమగలం పొండిరా  అని.. అరీచి చెబుతాను
ఒప్పినోళ్ళు మెచ్చనీ.. ఒప్పనోళ్ళు చచ్చనీ


వస్తా...ఎళ్ళొస్తా...  మళ్లెప్పుడొస్తా
పెళ్ళప్పుడొస్తా... మన పెళ్ళప్పుడొస్తా...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3574

No comments:

Post a Comment