Wednesday, March 11, 2015

ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి

చిత్రం :  అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :



ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
తనకో ముద్ద.. నాకో ముద్ద


ఆకేసి.. పప్పేసి.. బువ్వేసి.. నెయ్యేసి
తనకో ముద్ద.. నాకో ముద్ద

తినిపించువాడొచ్చే వేళయింది.. వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది

ఇలా.. ఇలా.. ఇలా..ఆ..ఇలా.. ఇలా.. ఇలా..



చరణం 1 :



అతగడే జతగాడు అనుకున్నది.. అనుకున్నదే కలలు కంటున్నది
అతగాడే జతగాడు అనుకున్నది.. అనుకున్నదే కలలు కంటున్నది

కలలోని విందు... కనులవిందవునా
కలలోని విందు... కనులవిందవునా
మనసులోని ఆశ... మాంగళ్యమౌనా

ఇలా... ఇలా... ఇలా..ఆ..ఇలా... ఇలా... ఇలా





చరణం 2 :



ఇది కలా... కలా... కలా... మనమిలా.. ఇలా... ఇలా 

గాలిలా పువ్వులా తావిలా... కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము... తెలియకనే


వెలుగుకు నీడకు చెలిమిలా... ఒక్కటైనాము కలవకనే
ఒదిగి ఉన్నాము... కరగకనే 



ఈ ప్రేమపత్రము..ఈ జన్మకు చెల్లువేయ్యుము
ప్రతి జన్మజన్మకు..మరల తిరగ వ్రాసుకొందము 


ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ
ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా 



ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది 



చరణం 3 :




వెన్నెల కలువలా చెలువలా మందగించాము... జతలుగ
విందులవుదాము... కథలుగా



కన్నుల పాపలా... చూపులా.. చూచుకుందాము... సొగసులుగా
పగలు రేయిగా... రేయి పగలుగా



ఈ రాగసూత్రము... మూడుముళ్ళు వేసుకుందము
ఈ మూగమంత్రము... దీవెనగా చేసుకుందము


ఎలా ఎలా ఎలా..ఆ... ఆ... ఆ...
ఇలా.. ఇలా.. ఇలా..ఇలా... ఇలా... ఇలా



ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది..ఆశ ఉంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్....  మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్



No comments:

Post a Comment