Friday, September 4, 2015

నీలాల నింగిలోన

చిత్రం :  దానధర్మాలు (1976)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  కొండిసెట్టి శ్రీరామా రావ్
నేపధ్య గానం :  సుశీల, బాలు 



పల్లవి :


నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి
రతనాల రంగులతో.. ముత్యాల ముగ్గులు వేద్దామా
ముత్యాల ముగ్గులు వేద్దామా... 



చరణం 1 :


పుష్పరాగములతో.. పొదిగిన పచ్చలతో..
పుష్పరాగములతో.. పొదిగిన పచ్చలతో..కెంపులతో సొంపుగనూ
వజ్రాల వంపులు తీర్చిన.. ఆ వయ్యారి భామవు నీవే.. వరసైన చినదాన  


వరసైనదానిని కాను.. ఆ సిసలైన దానిని నేను
సిగ్గు తెర తీసి చెప్పాను నేను చేసుకుంటాను నిన్నేననీ
ఒప్పుకుంటే కదా నిన్ను నేను... చేశారు ఈ పెళ్ళి మనకు
మూడుముళ్ళు విప్పిన కూడా పోలేవు ముందుకు నీవు...
పోలేవు ముందుకు నీవు... 



చరణం 2 :


మనసైన మగువతో మాటాడకుండ లేను...
మనసైన మగువతో మాటాడకుండ లేను...
నిన్ను విడిచి నిముషమైన నిలువలేను ఈ జగాన
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ప్రేమగ చూస్తే చాలు నీ పాద పూజ చేస్తాను
జన్మజన్మలకైనా నిన్నే కోరుకుంటాను... నిన్నే కోరుకుంటాను...
 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7223

No comments:

Post a Comment