Monday, September 7, 2015

మేలి వెన్నెల కాయసాగే

చిత్రం :  విమల (1960)
సంగీతం :  ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు
గీతరచయిత :  ముద్దు కృష్ణ
నేపధ్య గానం :  జయలక్ష్మి 

పల్లవి :

మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే

నాలో కలలు చెలరేగే నను గనవిదేరా.. ప్రేమ .. మీరా

చరణం 1 :

గుండె దడ దడలు మీరి... నినే నిండు మనసు నను కోరి

కన్నుతళుకులకు నన్నే మరిచినాను  కదరా.. మది .. చెదరా
కన్నుతళుకులకు నన్నే మరిచినాను  కదరా.. మది .. చెదరా 

మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే 

చరణం 2 :

చక్కదనము సొమ్ము నేనే.. నీకే చిక్కి సమస్తమీనాడే

ఒక్క పలుకుతోనే.. చిక్కు తీరునురా
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ...నా దిక్కే  చూడవేరా ..
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ.. నా దిక్కే  చూడవేరా ..

చరణం 3 :

మనసు మనసు పెనవేసి.. మన మమతలొకటిగను  చేసి
మనసు మనసు పెనవేసి.. మన మమతలొకటిగను  చేసి 

కలలు కనిన మన వలపు ఫలములను కనరా .. సుఖమగురా
కలలు కనిన మన వలపు ఫలములను కనరా .. సుఖమగురా

మేలి వెన్నెల కాయసాగే.. చల్లగాలి తగిలి తీగలూగే 

నాలో కలలు చెలరేగే నను గనవిదేరా.. ప్రేమ .. మీరా

No comments:

Post a Comment