Thursday, October 1, 2015

నీవే.. నీవే.. ఓ ప్రియా



చిత్రం :  మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల 




పల్లవి :



నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 



చరణం 1 :


అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో
నను పిలిచే కోరిక నీవే...  నను పిలిచే కోరిక నీవే


పగలు  రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై
నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే
ఆ.. ఆ... ఆ...ఆ...


నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 




చరణం 2 :


పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో
నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే



అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై
నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే
ఆ... ఆ.. ఆ ... ఆ... 


నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4019

No comments:

Post a Comment