Friday, October 2, 2015

మాటల కందని భావాలూ

చిత్రం :   నీతి - నిజాయితి (1972)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం :  సుశీల 





పల్లవి :


మాటల కందని భావాలూ.. మంచి మనసులు చెబుతాయీ
కవితల కందని భావాలూ.. కంటిపాపలే చెబుతాయీ
మాటల కందని భావాలూ.. మంచి మనసులు చెబుతాయీ 


చరణం 1 :


వెన్నెల మాటాడునా.. వెదజల్లును చల్లదనాలూ
మల్లిక మాటాడునా.. కురిపించును పరిమళాలూ
వెన్నెల మాటాడునా.. వెదజల్లును చల్లదనాలూ
మల్లిక మాటాడునా.. కురిపించును పరిమళాలూ 


బాసరాని పాపాయి.. బోసినవ్వు చాలదా?
బాసరాని పాపాయి.. బోసినవ్వు చాలదా?
ఏనాడూ పలకని దైవం ఈ లోకము లేలదా..  ఈ లోకము లేలదా ?


మాటల కందని భావాలూ.. మంచి మనసులు చెబుతాయీ


చరణం 2 :



పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలూ
కొండవాగు తరగలలో కోటిరాగ మాలికలూ
పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలూ
కొండవాగు తరగలలో కోటిరాగ మాలికలూ

హృదయానికి చెవులుంటే.. జమగమంతా నాదమయం
హృదయానికి చెవులుంటే.. జమగమంతా నాదమయం
కనకలిగిన మనసుంటే.. బ్రతుకే అనురాగమయం..  బ్రతుకే అనురాగమయం

మాటల కందని భావాలూ.. మంచి మనసులు చెబుతాయీ
కవితల కందని భావాలూ.. కంటిపాపలే చెబుతాయీ
  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7206

No comments:

Post a Comment