Thursday, October 8, 2015

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ

చిత్రం :  మేనకోడలు (1972)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల




పల్లవి :


ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు ..
ఎన్నాళ్ళో ?
ఎన్నాళ్ళా.. నా మనసు నీ మనసు తెలిసేదాకా
నా పెదవి నీ పెదవి కలిసే దాకా
ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ





చరణం 1 :



అలలాగా వెన్నెలలాగా.. నువ్వలుముకుంటే నా మనసే ఆగునా.. హొయ్
కనుగీటి.. బుగ్గను మీటీ.. నువు పెనవేస్తే నా వలపే దాగునా

దాగని ఆ వలపే కావాలీ.. దాగని ఆ వలపే కావాలీ
నువ్వు నా దానివై ఉండిపోవాలీ.. ఆ.. ఊ 

ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ..
ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
నా కొంగు నీ కొంగు కలిపే దాకా..
కళ్యాణ రాగాలు పలికే దాకా.. అందాకా.. అందాకా 



చరణం 2 :



పుత్తడిబొమ్మలా ఉన్నావూ.. పున్నమి పువ్వులా ఉన్నావూ
మల్లెల  పాన్పు మీద ఉన్నావూ 


హొయ్..  మల్లెల పాన్పు మీద ఉన్నావూ
చల చల్లగా మెల్లగా అల్లరి పెడుతున్నావూ.. ఊ..  ఊ


ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళూ.. ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళూ
చిన్నారి పాపాయి కలిగేదాకా.. ఇన్నాళ్ళ పైడి కలలు పండే దాకా.. హహహహ


ఆహహహా..  ఆహహహా.. ఆహాహాహా
ఊహుహుహూ.. ఊహుహుహూ.. ఊహుహుహూ



No comments:

Post a Comment