Wednesday, March 1, 2017

ఇదో ప్రేమగోపురం






చిత్రం : బంధం (1986)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 





పల్లవి : 


ఇదో ప్రేమగోపురం... ఇదే నీకు ఆలయం
చిలిపి నవ్వులతోనే....
వలపు దీపాలెన్నో పెట్టాలంట తోడు నీడా నేనై


ఇదో ప్రేమగోపురం... ఇదే నీకు ఆలయం



చరణం 1 :


పువ్వుతేనై నువ్వు నేనై ముద్దాలాడాలంటా
గాలివానై నీలో నేనై నీళ్ళాడాలంటా


చెదరని కుంకుమ బొట్టు... చెలిమికి వేకువ పొద్దు
మమతలే మనుగడై... కలిపిన వలపుల కౌగిలి
లో

నీ నీడలో ఆశలా మేడలే నిలుపనా


ఇదో ప్రేమగోపురం... ఇదే నీకు ఆలయం



చరణం 2 :



మేఘాలల్లే తాకంగానే మెరుపవ్వాలంటా
ఆకాశంలో నక్షత్రాలే నగలవ్వాలంటా


తరగని కాటుక కన్ను... పాపగ చేసెను నన్ను
సిరులనే అడగని మరులులో పెరిగిన ప్రేమలలో


నీ పూజకే పూవునై పూయనా...  రాలనా


ఇదో ప్రేమగోపురం... ఇదే నీకు ఆలయం
చిలిపి నవ్వులతోనే ...
వలపు దీపాలెన్నో పెట్టాలంట తోడు నీడా నేనై


ఇదో ప్రేమగోపురం... ఇదే నీకు ఆలయం
ఇదో ప్రేమగోపురం... ఇదే నీకు ఆలయం
లలాలాలలలా... లలాలాలలలా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2796

No comments:

Post a Comment