చిత్రం : ముద్దుల కొడుకు (1979) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఓలోలే నీ సోకు... లేలేత తమలపాకు... తాంబూలమివ్వమంటా నా సూపే సున్నమేసి... నీ వలపే వక్క చేసి చిలక చుట్టి ఇస్తుంటే... నీ చిటికనేలు కొరుకుతుంటా ఆహుం..ఆహుం..ఆహుం..
ఓలేలే నా సోకు... ఈ లేత తమలపాకు... తాంబూల మిచ్చుకొంటా అందాలే విందు చేసి..మురిపాలే ముద్దు చేసి... చిలకచుట్టి ఇస్తుంటే ఈ చిలిపి కొట్టూడెందుకంటా... ఆహుం..ఆహుం..ఆహుం
చరణం 1 :
ఆ సున్నమెక్కువైనా... ఈ వక్క తక్కువైనా నీ నోరు పొక్కుతుంది... నా జోరు ఎక్కుతుంది ఆ సున్నమెక్కువైనా... ఈ వక్క తక్కువైనా నీ నోరు పొక్కుతుంది... నా జోరు ఎక్కుతుంది
మక్కువెక్కువైనప్పుడు పొక్కదూ.. పొక్కినా పెదవుల్లో... చక్కెర పులుపెక్కదు..ఆహా మక్కువెక్కువైనప్పుడు... పొక్కదూ.. పొక్కినా పెదవుల్లో... చక్కెర పులుపెక్కదు.. ఆహుం..ఆహుం..ఆహుం... ఆహుం
అరెరెరె..ఓలోలె నీ సోకు..లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా
No comments:
Post a Comment