Showing posts with label అందరికీ మొనగాడు (1971). Show all posts
Showing posts with label అందరికీ మొనగాడు (1971). Show all posts
Friday, April 24, 2020
దారంట పోయేదానా
చిత్రం : అందరికీ మొనగాడు (1971)
దారంట పోయేదానా... నీ వెంట నేను రానా
పొగరు కళ్ళు నీవి... పోకిరి చూపులు నావి
నిషా కులుకులా.. ఖుషీ తళుకులా
దారంట పోయేదానా... నీ వెంట నేను రానా
ఇసుక తిన్నెల పైనా.. పగటి వెన్నెలలోనా
ఒకటే ఆటలో... ఒకటే పాటలో...
పొంగే వయసు నీది.. నీ పొంగుల రంజు నాది
దారంట పోయేదానా... హో..హో
అడగనా మాననా అమ్మాయి
చిత్రం : అందరికీ మొనగాడు (1971)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అడగనా.. ఉమ్మ్.. మాననా..ఉమ్మ్ అమ్మాయి... అడిగితే ఇస్తావా హాయి
అడగనా మాననా అమ్మాయి... అడిగితే ఇస్తావా హాయి
అడిగినా.. ఆ... మానినా.. ఆ.. అబ్బాయి.. ఎన్నడో కలిపాను చేయి
అడిగినా మానినా అబ్బాయి.. ఎన్నడో కలిపాను చేయి
చరణం 1 :
మగవాడు చేసేది ఏమిటి... వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది ఏమిటి... వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది అల్లరి...
మగవాడు చేసేది అల్లరి...
వగలాడి విరిసేది మురిసేది రాగవల్లరి
అడగనా మాననా అమ్మాయి... అడిగితే ఇస్తాను హాయి
చరణం 2 :
మగవాడు తలచేది ఏమిటి... జవరాలు మరువనిది ఏమిటి
మగవాడు తలచేది ఏమిటి... జవరాలు మరువనిది ఏమిటి
మగవాడు తలచేది కమ్మని కైపు
మగవాడు తలచేది కమ్మని కైపు
జవరాలు మరువనిది ప్రియతమ రూపు
అడగనా మాననా అమ్మాయి... అడిగితే ఇస్తాను హాయి
చరణం 3 :
మగవాడు కోరేది ఏమిటి... ప్రియురాలు ఇచ్చేది ఏమిటి
మగవాడు కోరేది ఏమిటి... ప్రియురాలు ఇచ్చేది ఏమిటి
మగవాడు కోరేది ఆనందం...
మగవాడు కోరేది ఆనందం...
ప్రియురాలు ఇచ్చేది... మెచ్చేది అనుబంధం
అడగనా మాననా అమ్మాయి... అడిగితే ఇస్తావా హాయి
అడిగినా మానినా అబ్బాయి.. ఎన్నడో కలిపాను చేయి
అహా.. అహహ.. ఊ..హూ..ఉహు...హు...
Subscribe to:
Posts (Atom)