Showing posts with label చిత్ర. Show all posts
Showing posts with label చిత్ర. Show all posts

Thursday, September 19, 2024

స్వప్న వేణువేదో సంగీతమాలపించే

 




చిత్రం :  రావోయి చందమామ (1999)

సంగీతం :  మణి శర్మ

గీతరచయిత :  వేటూరి 

నేపథ్య గానం : బాలు, చిత్ర


పల్లవి :


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

జోడైన రెండుగుండెల ఏకతాళమో

జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో

లే లేత పూలబాసలు కాలేవా చేతిరాతలు


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 


చరణం 1 :


నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం

ప్రేమ నేడు రేయి పగలు... హారాలల్లే మల్లెలు నీకోసం


కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ

నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరానా

కాలాలే ఆగిపోయినా... గానాలే మూగబోవునా



చరణం 2 : 


నాలో మోహం రేగే దాహం... దాచేదెపుడో పిలిచే కన్నుల్లో

ఓడే పందెం గెలిచే బంధం... రెండూ ఒకటే కలిసే జంటల్లో


మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం

పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం

వారేవా ప్రేమ పావురం... వాలేదే ప్రణయ గోపురం


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

జోడైన రెండుగుండెల ఏకతాళమో

జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో

లే లేత పూలబాసలు కాలేవా చేతిరాతలు


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 

Monday, February 5, 2024

కిటకిట తలుపులు

 




చిత్రం :  మనసంతా నువ్వే (2001)

సంగీతం :  ఆర్.పి. పట్నాయక్ 

గీతరచయిత :  సిరివెన్నెల

నేపథ్య గానం : చిత్ర


పల్లవి :



కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా

ప్రేమ...  ప్రేమ...  ప్రేమ..ఆ... ప్రేమ...


కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం


చరణం 1 : 


నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక

కమ్మని కలలో అయినా నిను చూడలేదే

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక

రెప్పపాటైనా లేక చూడాలనుందే

నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా

కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా

ప్రేమ... ప్రేమ...ఆ... ప్రేమ... ప్రేమ...


కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం



చరణం 2 : 


కంటితడి నాడు నేడు చెంప తడిమిందే చూడు

చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా

చేదు ఎడబాటే తీరు తీపి చిరునవ్వే చేరి

అమృతం అయిపోలేదా ఆవేదనంతా

ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా

ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా

ప్రేమ...  ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...


కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా

ప్రేమ...  ప్రేమ...  ప్రేమ..ఆ... ప్రేమ...

ప్రేమ...  ప్రేమ...  ప్రేమ..ఆ... ప్రేమ...

ప్రేమ...  ప్రేమ...  ప్రేమ..ఆ... ప్రేమ...

Thursday, July 23, 2020

ముద్దుల జానకి పెళ్ళికి

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : 
భువనచంద్ర

నేపథ్య గానం :  చిత్ర 


పల్లవి : 


ఓఓఓఓ..ఓఓ..ఓఓఓఓ....
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే


మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....


ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే



చరణం 1 :


తొలకరిలా వలపంతా కురిసెనులే
తీయని ఊహలు చిగురు తొడిగెను


నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగజేసి
నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగజేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళి జరిపించరారే


వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....


ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే



చరణం 2 :



తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే


కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళా
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేలా
సరసపు వయసున
ఒంపుల సొంపుల సరిగమ వినిపించే


ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...





నీ నవ్వే చాలు పూబంతి

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : బాలు, చిత్ర 



పల్లవి : 


నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక 


విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా 

కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా

మరో నవ్వు రువ్వరాదటే.... 

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 


చరణం 1 :



మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజి మొగ్గ నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా 


అతివకు ఆత్రము తగదటగా...
తుంటరి చేతులు విడువవుగా మనసు పడే పడుచు ఒడి...


ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 



చరణం 2 :


కోర మీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జామపళ్ళ రుచే చూపనా
కొంగు చాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా


పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా....  తదిగిణతోం మొదలెడదాం...



ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 

విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశామరో నవ్వు రువ్వరాదటే....  



ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి 
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక

ప్రియతమా... ప్రియతమా

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : బాలు, చిత్ర 



పల్లవి : 


ప్రియతమా...  ప్రియతమా
తరగని పరువమా... తరలిరా... తరలిరా

కన్నె గోదారిలా... కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేరరావే


ప్రియతమా... ప్రియతమా
తరగని విరహమా... తరలిరా... కదలిరా


మాఘమాసానివై... మల్లె పూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా 

ప్రియతమా...  ప్రియతమా
తరగని పరువమా... తరలిరా... తరలిరా 




చరణం  1 :



నీ ఆశలన్నీ నా శ్వాశలైనా... ఎంత మోహమో
నీ ఊసులన్నీ నా బాసలైనా... ఎంత మౌనమో 


ఎవరేమి అన్నా ఎదురీదనా....
సుడిగాలినైనా ఒడి చేరనా….


నీడల్లే నీ వెంట నేనుంటా
నా ప్రేమ సామ్రాజ్యమా 


ప్రియతమా... ప్రియతమా
తరగని విరహమా... తరలిరా... కదలిరా



చరణం 2 :


పెదవుల్ని తడితే పుడుతుంది తేనే... తీయతీయగా
కౌగిట్లో పడితే పుడుతుంది వానా... కమ్మకమ్మగా 


వెన్నెల్లో మంచం వేసేయనా...  ఏకాంత సేవా చేసేయనా

వెచ్చంగా చలి కాచుకోవాలా...  నీ గుండె లోగిళ్ళలో 



ప్రియతమా...  ప్రియతమా
తరగని పరువమా... తరలిరా... తరలిరా

కన్నె గోదారిలా... కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేరరావే


ప్రియతమా... ప్రియతమా
తరగని విరహమా... తరలిరా... కదలిరా







Tuesday, July 7, 2020

తొలి తొలి బిడియాల

చిత్రం :  ఇందిర (1995)
సంగీతం :  ఏ.ఆర్.రహ్మాన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు, చిత్ర
   


పల్లవి : 


తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా
తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై... పరవశాన పసి పరువానా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై... పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా


చరణం 1 :


చిన్న దాని వయసే చెంత చెర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూలప్రాయం ఝల్లుమనదా


ఆశల తీరాన మోజులు తీర్చేనా
హద్దుమరి తెంచేస్తే యవ్వనం ఆగేనా


తొలి తొలి బిడియాన పూవే సొగసుగ నలిగేలా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై...
నరముల వీణమీటే తరుణమిదే
తొలి తొలి బిడియాన పూవే సొగసుగ నలిగేలా



చరణం 2 :


మధువులు కురిసే పెదవుల కొరకే... ఇరవై వసంతాలు వేచి వున్నా
మదిలోని అమృతం పంచడానికేగా... పదహారు వసంతాలు నోచుకున్నా
ఇకపైన మన జంట కలనైన వీడరాదే... మరికొంటె కల వెంట కన్ని యెద తేలరాదె 


తొలి తొలి బిడియాన పూవే సొగసుగ నలిగేలా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై... పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా

Saturday, May 23, 2020

ఊరుకో ఊరుకో

చిత్రం  :  ఆత్మబంధం (1991)
సంగీతం  :  కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం  :  బాలు, చిత్ర 


పల్లవి :



ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా




చరణం 1 :


ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా
చల్లబడకుంది ఎడారి
ఎదలో.జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా
మొండి ఊపిరింకా మిగిలుందీ...


చల్లని నీ కళ్ళలో కమ్మనీ కల నేను
చెమ్మగిల్లనీయకుమా...  కరిగిపోతానూ


దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయి జారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా


చరణం 2 : 


గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమనీ
తప్పుపట్టి తిట్టేవారేరీ... తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా
అంటూ ఊరడించే నాన్నేరీ


చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేననీ
జన్మలెన్ని దాటైనా చేరుకుంటాననీ


దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయి జారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊ... రుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయి జారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా...




Wednesday, April 1, 2020

ఎదో వింత...

చిత్రం :  అంగరక్షకుడు (1994)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి : 


ఒలియ ఒలియ హో ఒలియ హో..
ఒలియ ఒలియ హో ఒలియ హో..
ఒలియ ఒలియ హో ఒలియ హో..


ఎదో వింత... ఒలియ హో
వలపే చింత... ఒలియ హో
చెప్పలేని మాట కూడ బాధే కదా
నిప్పులాంటి ఈడు కూడా నీరే కదా
అతని జతను వెతికే మనసు
చిలిపి తనాలా...  నాలా...  నా ఊహల


ఒలియ ఒలియ హో ఒలియ హో..
ఒలియ ఒలియ హో ఒలియ హో..


ఎదో వింత... ఒలియ హో
తకథైధింత... ఒలియ హో
మంచు వేళ మల్లె కూడా మంటే కదా
పైట జారు సోయగాల పంటే కదా
వలపు చిలక వగలు తెలిసే తళుకుమనేలా
ఎలా ఈ వెన్నెల...
ఎదో వింత... ఒలియ హో
తకథైధింత... ఒలియ హో 



చరణం 1 :




విరిసే పువ్వు ముసిరే ముద్దు ఎరగనిదీ వయసు
అది ప్రేమో.. మరి ఏమో.. ఎదలో పులకింత
కలిసే చూపు చెలిలో ఊపు ఆణువణువూ సొగసు
పగలైనా రేయైనా... చలిలో చెమరింత
సిగ్గోస్తున్న చిరాకేస్తున్న... సరేలేమన్న షరీపౌతున్న
హాయికదా..అ... ప్రేమకథా
పెదవులడిగె రుచులు మరుగు నవరస లీల... నీలా రేగేనిలా



ఎదో వింత... ఒలియ హో
తకథైధింత... ఒలియ హో 


చరణం 2 :


కసి నా కళ్ళు పసి నీ వొళ్ళు కడిగిన కౌగిలిలో
మొదలాయే ఎదలాయే మొదటే మోమాటం
ఇరు చెక్కిళ్ళు చిరు మావిళ్ళు కొరికే ఆకలిలో
వగరైన పొగరైన ఒకటే ఆరాటం
కొత్తందాలు కొలుస్తా నీకు... మొత్తం గానే ముడేస్తా సోకు
లాహిరిలో... ఊపిరిలో
తనువు తనువు తగిలి తపన రగిలిన వేళా.. బాలా... ఈ జోలల 

ఎదో వింత... ఒలియ హో
వలపే చింత... ఒలియ హో
మంచు వేళ మల్లె కూడా మంటే కదా
నిప్పులాంటి ఈడు కూడా నీరే కదా
వలపు చిలక వగలు తెలిసే తళుకుమనేలా
నాలా... ఈ వెన్నెల
ఒలియ ఒలియ హో
ఒలియ హో ఒలియ హో....
ఒలియ ఒలియ హో
ఒలియ హో.. ఒలియ హో
ఒలియ ఒలియ హో
ఒలియ హో... ఒలియ హో
ఒలియ ఒలియ హో
ఒలియ హో
ఒలియ హో... హహహ

ఆకాశ జోలలు హాయి హాయి

చిత్రం :  అంగరక్షకుడు (1994)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి : 


ఆ ఆఆ ఆఆఆ ఆ.......
ఆకాశ జోలలు హాయి హాయి... జాబిల్లి పాడిన రేయి
జోలలు పాడెను పూలగాలి
మామయ్య మా తోటమాలి మావిళ్ల కొమ్మ
మాకోయిలమ్మ అమ్మల్లే పాడెను లాలి
ఆకాశ జోలలు హాయి హాయి... జాబిల్లి పాడిన రేయి


చరణం 1 :


తళుకుమని తారక తను ఒంటిగా మెరిసే
ఇలా నీకోసం పలికినది గాలిగా కడు
జాలిగా మనసే కదా ఆకాశం
ఈ మల్లె పూల మంచు కన్నీరు
గాయాల నిండా హాయి పన్నీరు
ఏ పాట పాడినా ఒకటే
లాలించు ప్రేమ దీవించు అమ్మ
లల్లాయి పాటకు లాలి


ఆకాశ జోలలు హాయి హాయి... జాబిల్లి పాడిన రేయి
జోలలు పాడెను పూలగాలి... మామయ్య మా తోటమాలి


చరణం 2 :


చిలిపి సడి సేయకే చిరుగాలికే
నిదురే కలై పోతుంటే అలల గొడవెందుకే
సెలయేటి కి పరుగే పదాలౌతుంటే
రామయ్యలాలి పాడి త్యాగయ్య మామయ్య నాకు
నేటి రామయ్య ఏ పా ట పాడిన మమతే
లాలించు ప్రేమ దీవించు అమ్మ
లల్లాయి పాటకు లాలి


ఆకాశ జోలలు హాయి హాయి జాబిల్లి
పాడిన రేయి జోలలు పాడెను పూలగాలి
మామయ్య మా తోట మాలి మావిళ్ల కొమ్మ
మాకోయిలమ్మ అమ్మల్లే పాడెను లాలి
ఆకాశ జోలలు హాయి హాయి జాబిల్లి పాడిన రేయి

Wednesday, January 22, 2020

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు

చిత్రం :  అంకురం (1993)
సంగీతం :  హంసలేఖ
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు, చిత్ర  


పల్లవి :


ఎవరో ఒకరు...  ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా...  అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..

అ... అ... అ... అ... అ
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది


ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 1 :

కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా... అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే... మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి... ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి


ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 2 :

చెదరకపోదుగా చిక్కని చీకటి... మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని... రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా... జాలి చూపి తీరమే దరికి చేరునా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..










Monday, January 20, 2020

జారుపైటల జావళీలకు

చిత్రం :  అ ఆ ఇ ఈ (1994)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


జారుపైటల జావళీలకు పల్లవించే సిగ్గులు
కొంటె ఊసుల కంటి బాసకు చెమ్మరించే బుగ్గలు


తనది కానిది తనును కోరిన తపనలేమో చూపులు
జారుపైటల జావళీలకు పల్లవించే సిగ్గులు



చరణం 1 :


శివుడి బాణం సీత రూపం... ఝల్లుమన్నది ఏలనోఇంద్రచాపం సీతజల్లో పువ్వులైనది అంతలోకవితలల్లే కాళిదాసే కదలి వచ్చే తోటలోఉరకలేసే కన్నెవాగు ఉలికిపడ్డది అలలతో


కొండతగిలి కొంత జరిగి కరిగిపోయెను కలలతోరెండు రేవుల కృష్ణవేణికి ప్రేమ వారధి వేసుకో


కొంటె ఊసుల కంటి బాసకు చెమ్మరించే బుగ్గలు
జారుపైటల జావళీలకు పల్లవించే సిగ్గులు
తనది కానిది తనును కోరిన తపనలేమో చూపులు
జారుపైటల జావళీలకు పల్లవించే సిగ్గులు



చరణం 2 :


పిలుపు మోసిన పిల్లగాలి... తలుపు మూసెను ఎందుకో
పూలలో పువుబంతి దాటిన పూత కోరికలేమిటో
మనసులన్నీ మాటలైతే కళ్ళకీ సొదలెందుకో
పులకరింతల ఈ పురాణం పలకమారుట ఎన్నడో

గౌరి పూజకు సప్తపదులకు గట్టి మేళాలెప్పుడో
కొంగుముళ్ళకు మూడుముళ్ళకు లగ్గమున్నది కొద్దిలో


జారుపైటల జావళీలకు పల్లవించే సిగ్గులు
కొంటె ఊసుల కంటి బాసకు చెమ్మరించే బుగ్గలు
తనది కానిది తనును కోరిన తపనలేమో చూపులు
జారుపైటల జావళీలకు పల్లవించే సిగ్గులు

Sunday, January 19, 2020

ఏనాడు పుట్టావో ప్రేమా

చిత్రం :  అ ఆ ఇ ఈ (1994)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర




పల్లవి :


రురురురురురు... రురురురురూరూరూ
ఏనాడు పుట్టావో ప్రేమా... వేసంగి హేమంతమా


మనసునే కోరి... మనువుగా మారి.. సంగమించేటి ప్రేమా
ఏనాడు పుట్టావో ప్రేమా... శృంగార సీమంతమా


మనసులో బొమ్మ... మమతలో చెమ్మ... పల్లవించేటి ప్రేమా
ఏనాడు పుట్టావో ప్రేమా... వేసంగి హేమంతమా  



చరణం 1 :


వీచే  వసంత గాలి లాలన ప్రేమా
పూచే సుమాల ధూళి చల్లిన ప్రేమా
ఇది సుమా... ప్రియతమా 


మీటే సుగంధ వీణా వాసన ప్రేమా
ఎన్నో యుగాలు దాటే వంతెన ప్రేమా
ఇది సుమా... ప్రణయమా


కలిసి చూడాలి ఈ పొంతనా.. తనా... మనా


ఏనాడు పుట్టావో ప్రేమా... శృంగార సీమంతమా
మనసులో బొమ్మ... మమతలో చెమ్మ... పల్లవించేటి ప్రేమా
ఏనాడు పుట్టావో ప్రేమా... వేసంగి హేమంతమా



చరణం 2 :


లలలలలా.. లలలలలా.. లలలలా
లలల.. లలల... లలలలా


గోపీ యశోద కోరే పెన్నిధి ప్రేమా
రాధా పురాణగాధ హారతి ప్రేమా
ఇది సుమా... ప్రియతమా


సలీం అనార్కలీలా సంగమ ప్రేమా
చరిత్ర పుటాల కింద సమాధి ప్రేమా
ఇది సుమా.. ప్రణయమా


తెలిసి పాడాలి ఈ కీర్తనా.. సనా... తనా


ఏనాడు పుట్టావో ప్రేమా... వేసంగి హేమంతమా
మనసునే కోరి... మనువుగా మారి.. సంగమించేటి ప్రేమా
రురురురురురూ... రురురురురురురూ... 

Sunday, January 13, 2019

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా

చిత్రం :  సోగ్గాడి పెళ్ళాం (1996)
సంగీతం :  కోటి
గీతరచయిత :  భువనచంద్ర
నేపథ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


కలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది...  తుమ్మెద ఓ తుమ్మెద
మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది...  తుమ్మెద ఓ తుమ్మెద
గొబ్బియ్యళ్లో...  గొబ్బియ్యళ్లో
చలిమంట వెలుగుల్లూ...  తుమ్మెద ఓ తుమ్మెద


సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా...  సరదాలు తెచ్చిందే తుమ్మెదా
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో...  ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా... ఆ... ఆ...పేరంటం
ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో... పొంగే హేమంత సిరులు 


గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
 



చరణం 1 :


మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ...  నమ్మే మన పల్లెటూళ్లు
న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ...  చెబుతాయి స్వాగతాలు
బీద గొప్పోళ్లనే మాటలేదు...  నీతి నిజాయితీ మాసిపోదు
మచ్చలేని మనసు మాది...మంచి పెంచు మమత మాది
 ప్రతి ఇల్లో బొమ్మరిల్లు


సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా



చరణం 2 :



పాటే పంచామృతం మనసే బృందావనం... తడితేనే ఒళ్లు ఝల్లు
మాటే మకరందము చూపే సిరి గంధము... చిరునవ్వే స్వాతి జల్లు
జంట తాళాలతో మేజువాణి...  జోడు మద్దెళ్లనీ మోగిపోనీ
చెంతకొస్తే పండగాయే...  చెప్పలేని బంధమాయే
వయసే అల్లాడిపోయే...


సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
హోయ్ సరదాలు తెచ్చిందే తుమ్మెదా
హోయ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో... ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా... ఆ... ఆ... పేరంటం
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో... పొంగే హేమంత సిరులు...

Sunday, December 30, 2018

ఉత్తరాల ఊర్వశి

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, చిత్ర    




పల్లవి : 


ఉత్తరాల ఊర్వశి...ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత... వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా


గీత గోవిందుడు...  వీనులో విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజా...  ఘుమాఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ



చరణం 1 :  


పువ్వులెన్నొ విచ్చినట్టుగా చెలీ...  నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నొ పుట్టినట్టుగా ప్రియా...  చూసుకోరా పట్టి కౌగిలీ
ఖవాలీల కన్నులతోనే...  జవానీల జాబులురాసే
జగడమొకటి సాగిందోయమ్మో...
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే పాలగా...


దోరసోకు తోరణాలు...  కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసినా...


ఉత్తరాల ఊర్వశి... ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెలా
నిజానికీ ఇదంత ఒట్టు నీదయా..




చరణం 2 :



సమ్ముఖాల రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే


పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నొ కవ్విస్తుంటే
హృదయమొకటి పుట్టిందోయమ్మా...
సరాగాల సంపెగల్లో పరాగాల పండిస్తుంటే
పరువమొకటి వచ్చే వాంఛలా...
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడె
జుంటి తేనె మత్తులోన కొంటెవేణువూదినా


గీతగోవిందుడూ...  వీనులోవిందుడూ
రాగమాలతోనె రాసలీలలాడగా
మజా మజా మజా...  ఘుమాఘుమాలయా...
నిజానికీ ఇదంత...  ఒట్టు నీదయా...


ఉత్తరాల ఊర్వశి...  ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడివెన్నెలా...
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా... 

ప్రణయమా నీపేరేమిటి

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపథ్య గానం :  బాలు, చిత్ర  




పల్లవి : 


ప్రణయమా నీ పేరేమిటి ... ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా..  తెలుపుమా


ప్రణయమా నీపేరేమిటి...  ప్రళయమా 



చరణం 1 :



ప్రేమ కవితా గానమా... నా ప్రాణమున్నది శ్రుతి లేక
గేయమే ఎద గాయమైనది...  వలపు చితిని రగిలించగా
తీగచాటున రాగమా...  ఈ దేహమున్నది జత లేక
దాహమారని స్నేహమై...  ఎద శిథిల శిశిరమై మారగా


ఓ హృదయమా... ఇది సాధ్యమా...
రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన
రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన



తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా 





చరణం 2 : 



ప్రేమసాగర మధనమే...  జరిగింది గుండెలో ఈ వేళ
రాగమన్నది త్యాగమైనది...  చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై...  చెలరేగు మనసులో ఈ వేళ
అశ్రుధారలే అక్షరాలుగా...  అనువదించెనా జీవితం


ఓ ప్రాణమా... ఇది న్యాయమా
రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా
రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా



తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా 

ఒక మనసుకు నేడే పుట్టినరోజు

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు, చిత్ర   




పల్లవి : 


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే..ఇదే..కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక...  జనించు రోజు


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు  



చరణం 1 :


మాట పలుకు తెలియనిది...  మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి...  కవితలు రాసే మౌనమది..ఈ.. ఈ.. ఈ


రాగల రోజుల ఊహలకి... స్వాగతమిచ్చే రాగమది
 శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది..ఈ.. ఈ.. ఈ


ఋతువుల రంగులు మార్చేది...  కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది...  మనసున కదిలిన మృదునాదం


కలవని దిక్కులు కలిపేది...  నింగిని నేలకి దింపేది
అదే కదా వారధి క్షణాలకే సారధి...  మనస్సనేది


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు




చరణం 2 : 



చూపులకెన్నడు దొరకనిది...  రంగురూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు...  స్వప్నాలెన్నో చూపినది..ఈ.. ఈ.. ఈ
వెచ్చని చెలిమిని పొందినది...  వెన్నెల తరగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది..ఈ.. ఈ.. ఈ


చేతికి అందని జాబిలిలా...  కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కొయిలలా...  కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి...  అమృత వర్షిణి అనిపించే
అముల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు


చెప్పకనే చెబుతున్నవి

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)

సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  భువనచంద్ర
నేపథ్య గానం :  బాలు, చిత్ర   




పల్లవి : 


కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై... తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే... చెప్పకనే...  చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని  


చెప్పకనే  చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని


చరణం 1 :


చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే...
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా 


పదాలతోనే వరించనా... సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా... సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల... రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే


చెప్పకనే ... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని 



చరణం 2 : 



తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ


తెల్లారనీకే వయ్యారమా ... అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా... సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు... నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో...  ఒదిగిన క్షణమే


చెప్పకనే... చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని




రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర   



పల్లవి : 


ఆహ హాహా హాహా..ఆహా హాహా
ఆహ హాహా హాహా..హహహా హహహా
హహహా..హహహా..హాహా
ఆఆ ఆఆఆఆ..ఆఆ ఆఆఆఆ..ఆఆహాహ


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నువ్వా 


పడుచుదనపు గడసు వలపు  పాటవు నువ్వా..వా..వా  


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా..రోజాపువ్వా..పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా...  పువ్వే నువ్వా..నవ్వే నువ్వా



చరణం 1 :


గులాబి గు..గు..గు..
గులాబి గు..గు..గు 


చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా
కన్నె  పువ్వా... కన్నె  పువ్వా
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా ... చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ..ఆ.. ఆ..ఆ



రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వేనువ్వా


చరణం 2 : 

గులాబి గు..గు..గు..
గులాబి గు..గు..గు 



ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా
గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా


రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ గళ్లుమన్న  మువ్వే నువ్వా
పడుచుదనపు గడసువలపు  పాటవు నువ్వా..వా..వా  


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా...నవ్వే నువ్వా


Thursday, December 27, 2018

ఎప్పుడు ఎప్పుడు

చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



చరణం 1 :


ఒక మాటు ఒడిని మీటి...  

ఒక మాటు ఒడిని మీటి... వలపు రాగాలు లాగేసుకుంటాలే 


పొద చాటు కథలు దాటి...  

పొద చాటు కథలు దాటి... చిలిపి తాళాలు మోగించుకుంటాలే  


ఎప్పటికప్పుడు దప్పిక తీరని చెప్పని దాహాలే

ఏమని చెప్పను నీకు జవాబులు పైటల పాప


అచ్చట ముచ్చట ఇచ్చట గిచ్చుడు పెంచిన మొహాలే

ఎంతని ఆపను నిన్ను మరీ మది బిత్తరపోక


చక్కని చుక్క తన సొంతం అనుకోమాక బలవంతం 

కోరికలే ఓపికలై మోజులు తెచ్చిన అల్లరిలో 


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 




చరణం 2 :



పొరపాటో తెరకు చాటో...  

పొరపాటో తెరకు చాటో... వయసులాటాడుకోవాలి ఈనాడే 

అది ఆటో పెదవి గాటో...  

అది ఆటో పెదవి గాటో ... మధుర గాయాలు తాకాలి లోలోనే


చప్పున ఆరని నిప్పుల కుంపటి రేపిన తాపాలే

చల్లని వెన్నెల చిచ్చుల ఉచ్చులు వేసెను నాకే


అచ్చిక బుచ్చిక పిచ్చిగ మచ్చిక చేసిన అందాలే

జంటగ తుంటరి రెప్పల గంటలు కొట్టెను నేడే


చమ్మని చక్కే మన ఆట...  మల్లెల పక్కే మన తోట

నవ్వులతో పువ్వులతో రివ్వులు పెట్టిన ప్రేమలలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 







Tuesday, December 19, 2017

కుశలమా ప్రియతమా

చిత్రం :  అ ఆ ఇ ఈ (1994)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్యగానం :  బాలు, చిత్ర


పల్లవి :



కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా
దయరాదా కోపమా... దరి చేరా పాపమా
కబురే లేదు ఇన్నాళ్ళుగా... కలయా.. కలయికా


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా


చరణం 1 :


కన్నుల్లోనా ప్రాణాలు నిలిపి... వెన్నెల్లోనా ప్రాయాలు తడిపి
కాలాలన్నీ కన్నీట గడిపి... దీపాలెన్నో చూపుల్లో చిదిపి
ఏకాంతంలోనా ఓ సాయంత్రం లాగా...
నీకై వేచి వేచీ వేగుచుక్కనైతిరా


నిన్నే కోరి ఆరాలు అడిగి... నీలాకాశం తీరాలు వెతికి
శీతాకాలంలో చన్నీరెండల్లాగా ... నీవే రానీ పూలదారినైతి నా చెలి


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా
దయరాదా కోపమా... దరి చేరా పాపమా
కబురే లేదు ఇన్నాళ్ళుగా... కలయా.. కలయికా


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా 



చరణం 2 :


శ్రీకారంలో క్రావళ్ళు విరిచి... చీరంచుల్లో కుచ్చిళ్ళు మడిచి

స్వప్నాలొస్తే నా కళ్ళు తెరిచి... స్వర్గంలాగా నా ఒళ్ళు మరిచి

వయ్యారం చూసి నా ఓంకారం రాసి... దేవీ నీకే నేను పాదదాసుడైతినే



మాలక్ష్మమ్మ పాదాలు కడిగి... మంగళగౌరిని మాంగళ్యమడిగి
శ్రావణమాసంలో ఆ శుభముహూర్తం కోసం...
స్వామీ నాకై నేనూ ఎంత భారమైతిరా... 



కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా
దయరాదా కోపమా... దరి చేరా పాపమా
కబురే లేదు ఇన్నాళ్ళుగా... కలయా.. కలయికా


కుశలమా ప్రియతమా...  విరహమే ప్రణయమా