Sunday, December 9, 2012

ఒక మారు కలిసిన అందం

చిత్రం: గజిని (2005)
సంగీతం: హరీస్ జయరాజ్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: కార్తీక్

పల్లవి:

ఒక మారు కలిసిన అందం అల లాగ ఎగిసిన కాలం
ఒక మారు కలిసిన అందం అల లాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టూకుంది నిన్నే
అది నన్ను పిలిచినంది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే చూసానే చూసానే

చరణం 1:

పాత పదనిస దేనికది నస నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా నీ సా నను తాకే కొండ మల్లికా నీ సా
సరిజోడు నేనేగా .. అనుమానం ఇంకేలా

అ. ఒక మారు కలిసిన అందం అల లాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

చరణం 2:

పేరు అడిగితే తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా
హో.. కనులార చూడాలే తడి ఆరిపోవాలే

ల ర లాల లర లల లాల ఓ ల ర లాల లర లల లాల
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టూకుంది నిన్నే
అది నన్ను పిలిచినంది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే చూసానే చూసానే

No comments:

Post a Comment