Thursday, December 4, 2014

అనుబంధం ఆత్మీయత

చిత్రం :  తాతా మనవడు (1973)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  రామకృష్ణ 





పల్లవి :



అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం


అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం
 



చరణం 1 :



ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?



కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ
అది కాలుతున్నా వెలుగులే - కావాలి అందరికీ. . అందరికీ       



అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం



చరణం 2 : 



కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ
నిన్ను కడసారైనా చూడరాలేదూ - వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ 



అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం





చరణం 3  : 


కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా?  . . చితిమంటల చిటపటలు వినిపించేనా?  



అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం..  వింతనాటకం అనుబంధం







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7207

No comments:

Post a Comment