Showing posts with label దాసరి. Show all posts
Showing posts with label దాసరి. Show all posts
Sunday, January 13, 2019
సంబరాలా సంకురాత్రి
చిత్రం : ఊరంతా సంక్రాంతి (1983)
సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
సంబరాలా సంకురాత్రి..ఊరంతా పిలిచిందీ
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
అల్లీ అల్లని పందిట్లో... అల్లరి జంటల ముచ్చట్లు
హోయ్... సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
కళ్ళల్లోని ఆశలన్ని కొండా కొచ్చేసై... ముడుపులిచ్చీ
హోయ్..వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
ఆహా హా..నవ్వీ నవ్వని నవ్వుల్లో... తెలిసీ తెలియని పరవళ్ళు
సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
Saturday, December 29, 2018
కదలకు..కన్ను కన్ను కలుపు
చిత్రం : మజ్ఞు (1989)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
గీతరచయిత : దాసరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు... మ్ మ్ మ్ మ్
కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు... మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ
చరణం 1 :
కలలు ఎంత కమ్మన... ప్రేమకు
కనులు ఎంత చల్లన... ప్రేమకు
రాతిరెఒత వెచ్చన... ప్రేమకు..
లోకమెంత పచ్చన... ప్రేమకు..
ఎన్ని ఎన్ని రంగులో... ప్రేమకు..
ఎన్ని ఎన్ని గురుతులో... ప్రేమకు..
రంగులన్నీ కలబోసి... గురుతులన్ని ముడి వేసి
బ్రతికించు ప్రేమని... బ్రతుకంతా
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
అడగకు... ఆశ రేపి పోకు
తాకకు... తనువు విడిచి పోకు
రేపకు... రేపు మాపు అనకు
అడగకు...మ్ మ్ మ్ మ్ మ్
చరణం 2 :
ఏమిటీ... జీవితం
ప్రేమేలే... జీవితం
ఎవరికీ... అంకితం
ప్రేమకే... అంకితం
కొలనే ప్రేమైతే... మునకంతా నేనే
వరదె ప్రేమైతే... పొంగంతా నేనే..
నేనే..నేనే..నేనే
కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు..మ్ మ్ మ్ మ్
కదలకు..కన్ను కన్ను కలుపు
వదలకు..వలపు కథలు తెలుపు
బెదరకు..గుండె వేడి తెలుపు
మరువకు..మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ
అడగకు... ఆశ రేపి పోకు
తాకకు... తనువు విడిచి పోకు
రేపకు... రేపు మాపు అనకు
అడగకు... మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
Wednesday, June 6, 2018
సంభవం నీకే సంభవం
చిత్రం : బొబ్బిలి పులి (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
పరిత్రాణాయ సాధూనాం... వినాశాయ చదుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... యుగే యుగే... యుగే యుగే
సంభవం నీకే సంభవం... సంభవం నీకే సంభవం
ధర్మానికి నువ్వే రాజువై... న్యాయానికి నువ్వే మూర్తివై
ధర్మానికి నువ్వే రాజువై... న్యాయానికి నువ్వే మూర్తివై
అవినీతినే అణచివేయ్... అన్యాయమే తుడిచివేయ్
అది నీకే సంభవం... సంభవం... సంభవం
చరణం 1 :
తల్లి కడుపు పండగా... పుట్టినావు కొడుకుగా
తల్లి కట్టే కాలగా... చేరినావా కాటికి
చెల్లి వలపు పంటగా... వీడినావు ప్రేమని
చెల్లి గుండె రగలగా... ఆర్పినావా మంటను
ఆ రగిలే మంటలు ఎక్కడివి?
ఆ పగిలే గొంతులు ఎవ్వరివి?
నీ తల్లివా... నీ చెల్లివా....
నీ తల్లివా... నీ చెల్లివా
దిక్కులేని అనాధలవా...
రోడ్డు పక్క అభాగ్యులవా
ఆ పాపుల పాలిటి పులివై బెబ్బులివై
బొబ్బిలిపులివై... బొబ్బిలిపులివై సాగిపో..
సంభవం నీకే సంభవం... సంభవం నీకే సంభవం
చరణం 2 :
రక్తానికి రక్తం సిద్దాంతం
ప్రాణానికి ప్రాణం సమాధానం
గుండెకు గుండె మార్పిడి
స్వార్ధానికి స్వార్ధమే దోపిడీ
అసత్యానికి నాలుక కోసెయ్
అధర్మానికి చేతులు నరికెయ్
అన్యాయానికి అక్రమానికి... కాళ్ళు చేతులు తీసేయ్...
కన్నెపిల్లలను పిల్ల తల్లులను తార్చే
దిగజార్చే తెగమార్చే తార్పుడు గాళ్ళను
రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి
మసి పూసేసే కను మూసేసే దేశద్రోహులను
చీల్చాలి చెండాడాలి... చీల్చి చీల్చి చెండాడాలి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=375
Thursday, February 1, 2018
సంబరాలా సంకురాతిరి
చిత్రం : ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం : బాలు
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, జానకి, సుశీల
పల్లవి :
సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
సంబరాలా సంకురాత్రి..ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
తన తనెతాన తానాన తానా
తన తననాన తానె తానా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
చరణం 1 :
అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి... గంధాలు పూసేను
అ రె రె రె రె...
లోగిళ్ళలోన సిగ్గులన్ని వెల్లలేసే.. ప్రేమ రంగులేసే
కన్నెపిల్లలో సోకు పండిందనీ
కాపు కావాలనీ... తోడురావాలనీ..హోయ్
అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులువేసి... గంధాలు పూసేను
ఆ ఆ ఆ ఆ ఆ..
అల్లీ అల్లని పందిట్లో... అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో... ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే... మ్రోగాలనీ
హోయ్... సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఓఓ ఓహో... తానా తానా తానా తానా తానా ఆ తాననా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
చరణం 2 :
వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను.. హా
కళ్ళల్లోని ఆశలన్ని కొండా కొచ్చేసై... ముడుపులిచ్చీ
గుండెచాటు కలలన్ని తీరాలనీ... వలపు సాగాలనీ... రేవు చేరాలనీ
హోయ్..వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను
ఆహా హా..నవ్వీ నవ్వని నవ్వుల్లో... తెలిసీ తెలియని పరవళ్ళు
కలసీ కలవని కళ్ళల్లో... తీరీ తీరని ఆకళ్లు
తీరే రోజు రేపో మాపో రావాలనీ..హోయ్
సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
Sunday, January 7, 2018
పసుపు తాడుకు ముడులు వేసి
చిత్రం : రాగదీపం (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
పసుపు తాడుకు ముడులు వేసి... బంధమంటే సరి పోదు
ఏడూ అడుగులు నడిచినంతనే భార్య అంటే సరి కాదు...
సరిపోదు... సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి... బంధమంటే సరి పోదు
చరణం 1 :
హృదయానికి హృదయం బంధం
మరో హృదయానికి తెలియని అనుబంధం
ఏ అడుగు వేయలేనిది... ఎదురేమీ అడగలేనిది
తాడు లేనిదీ... ముడులు లేనిదీ
తుడుచుకు పోనిది... తెంచుకు పోనిది
ప్రేమకు మాంగల్యం... ప్రేమకు మాంగల్యం
పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు
సరిపోదు.. సరి కాదు
చరణం 2 :
అనురాగానికర్ధం త్యాగం... అదే అసలైన ప్రేమకు నిర్వచనం
మాటలకే అందనిది... మనసులకే అనుభవమైనదీ
భాష లేనిది... భావన వున్నది..
జన్మకు సరిపోనిది... జన్మలకే అంకితమైనదీ
ప్రేమకు మాంగల్యం... ప్రేమకు మాంగల్యం
పసుపు తాడుకు ముడులు వేసి... బంధమంటే సరిపోదు
ఏడూ అడుగులు నడిచినంతనే... భార్య అంటే సరి కాదు..
సరిపోదు.. సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1372
Friday, January 5, 2018
అదిగో అదిగో అదిగో
చిత్రం : రాగదీపం (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు
వచ్చేసై... వచ్చేసై...
కాకులు దూరని కారడవుల్లో...
చీమలు చేరని చిట్టడవుల్లో..
ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా
అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు
చరణం 1 :
నీలి నీలి ఆకాశం తెల్లబోయినా
తెల్ల తెల్ల మబ్బులా ముఖం మారినా
గాలిజోరు నిను వెనకకు లాగినా
దుమ్ము ధూళి నీ కన్నులు మూసినా
ముందు చూడక... వెనక చూడక
లెక్క చేయక వచ్చేసై..
కమాన్...కమాన్ ఐసే కమాన్... వచ్చేసై
కాకులు దూరని కారడవుల్లో
చీమలు చేరని చిట్టడవుల్లో
ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా
అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు
చరణం 2 :
ఉరిమి ఉరిమి మెరుపుల్లో... పిడుగురాలినా
జడిసి జడిసి మేఘలే... నీరు కారినా
జోరువాన నిను ముద్దగ చేసినా
వరద పొంగు నిను ముంచి వేసినా
ముందు చూడక... వెనక చూడక
లెక్క చేయక వచ్చేసై..
కమాన్... ఐసే కమాన్... వచ్చేసై
అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు
కాకులు దూరని కారడవుల్లో
చీమలు చేరని చిట్టడవుల్లో
ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా
ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1370
Thursday, December 21, 2017
ఆగదు ఏ నిముషము
చిత్రం : ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఆగదు ఆగదు... ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము... ముుందుకు సాగదు ఈ లోకము
ఆగదు ఆగదు... ఆగితే సాగదు
చరణం 1 :
జాబిలి చల్లననీ... వెన్నెల దీపమనీ
తెలిసినా గ్రహణమూ రాక ఆగదు
పువ్వులు లలితమని... తాకితే రాలునని
తెలిసినా పెనుగాలి రాక ఆగదు
హృదయుం అద్దమనీ... పగిలితే అతకదనీ
తెలిసినా... మృత్యువూ రాక ఆగదు
మృత్యువూ... రాక ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము... ముుందుకు సాగదు ఈ లోకము
చరణం 2 :
జీవితమొక పయనమనీ... గమ్యం తెలియదనీ
తెలిసినా ఈ మనిషి... పయనమాగదు
జననం ధర్మమని... మరణం కర్మమనీ
తెలిసినా జనన మరణ చక్రమాగదు
మరణం తధ్యమనీ... ఏ జీవికి తప్పదనీ
తెలిసినా... ఈ మనిషి తపన ఆగదు
ఈ బ్రతుకు తపన ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము... ముుందుకు సాగదు ఈ లోకము
ఆగదు ఆగదు... ఆగితే సాగదు
చరణం 3 :
మనసు మనసు కలయికలో
ఉదయిుంచక ఆగదు... అనురాగం
అనురాగపు అర్పణలో... చెలియిుంచక మానదు త్యాగం
ప్రేమ చెరిగినా మనసు చెదిరినా... ఆగదు త్యాగాభిషేకం
గెలుపు ఓడినా ఓటమి గెలిచినా... ఆగదు ప్రేమాభిషేకం
ఆగదు ప్రేమాభిషేకం....
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1363
Wednesday, December 20, 2017
వందనం అభివందనం
చిత్రం : ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం... పాదాభివందనం...
పాదాభివందనం... పాదాభివందనం...
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
చరణం 1 :
కన్నులు పొడిచిన చీకటిలో... ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో... తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని
వస్తానని నేను వస్తానని
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ..
వందనం అభివందనం
నీ అందమే... ఒక నందనం
చరణం 2 :
జీవితమన్నది మూడునాళ్ళని... యవ్వనమన్నది తిరిగిరాదని
ప్రేమన్నది ఒక నటనమనీ...నీకంటూ ఎవరున్నారని
ఉన్నారని... ఎవరున్నారని
ఉన్నానని... నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి
సుఖము పోసిన మేనక... అభినయ మేనక.. సారీ
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం... పాదాభివందనం...
పాదాభివందనం... పాదాభివందనం...
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
కోటప్పకొండకు వస్తానని
చిత్రం : ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే... కన్ను కన్ను కలిపేస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో
బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ... అహహా..
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
చరణం 1 :
హలో... హలో...
హలో... హలో...
హలో... హలో...
హలో హలో అనమంటుంది కుర్రమనసు
చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు
పొమ్మని పైపైకి అంటుంది... రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని పైపైకి అంటుంది... రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని రమ్మంటే అది స్వర్గం
రమ్మని పొమ్మంటే అది నరకం
ఆ స్వర్గంలోనే తేలిపోవాలి
ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే...
ఔనంటే నువ్వు ఊ... అంటే... నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ... అహహా..
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
చరణం 2 :
గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం
పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం
కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము
కళ్లు కుట్టుకుంటే గుణపాఠము
కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి
ఒళ్లు ఝల్లుమంటుంది... తొలిసారి
ఆ జల్లుల్లోనే... తడిసిపోవాలి
ఆ తడి కౌగిల్లో... అలిసిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే...
ఔనంటే నువ్వు ఊ... అంటే... నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే... కన్ను కన్ను కలిపేస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ... ఏహేహే..
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1871
Tuesday, December 5, 2017
సిత్తరాల తోటలో
చిత్రం : బుచ్చి బాబు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
సిత్తరాల తోటలో... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. హోయ్..
సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి...
నువ్వు రాశావా... నేను రాశానా
నాకు నువ్వు రాశావా... నీకు నేను రాశానా
సిత్తరాల తోటలో... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. హోయ్..
సిత్తరాల తోటలో చిత్తరాలు జరిగాయి...
నువ్వు చూశావా... నేను చూశానా
అవి నువ్వు చూశావా... అవి నేను చూశానా
చరణం 1 :
కలలో ఎవరో కనిపిసే... ఏదో ఏదో చెప్పేస్తే
కాగితమేదని వెతికాను... కాటుక కన్నుతో రాశాను
ఆ.. కన్నుల కాటుక కవితై వ్రాయగా
వెన్నెల కోయిలా... తీపిగ పాడగా
చెట్టులన్ని ఆడాయి... కొమ్మలన్ని ఊగాయి
ఆకు ఆకు గుసగుసలాడి... ఉత్తరాలు రాశాయి...
చరణం 2 :
చీకటి మాటున నడిచొచ్చి... వాకిట చాటున నిలబడితే.. అహా
ఎవరా ఎవరని చూశాను... గుండెల గుడిలో దాచాను
హే.. దాచిన దుడుకులు దాడులు చేయగా
చేసిన దాడులు... గుండెలు చీల్చగా
చెట్టులన్ని ఊగాయి ... కొమ్మలన్ని ఆడాయి
ఆకు ఆకు గుసగుసలాడి... సిత్తరాలు చేశాయి
సిత్తరాలు చేశాయి
సిత్తరాల తోటలో... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. హోయ్..
సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి...
నువ్వు రాశావా... నేను రాశానా
నాకు నువ్వు రాశావా... నీకు నేను రాశానా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1854
Wednesday, November 1, 2017
గాలి వానలో వాన నీటిలో
చిత్రం : స్వయంవరం (1982)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : ఏసుదాస్
పల్లవి :
గాలి వానలో... వాన నీటిలో
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం ... తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో... పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం.... తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
ఒఒఒ.... ఒఒఒ
చరణం 1 :
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హొరు గాలిలో వరద పొంగులో... సాగలేలని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
జోరు వానలో నీటి సుడులలో... మునక తప్పదని తెలుసు
అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం.... తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
చరణం 2 :
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఆశ జారినా వెలుగు తొలిగినా... ఆగదు జీవిత పొరాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై... బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం.... తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం.... తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2109
Wednesday, May 17, 2017
రాక రాక వచ్చింది గాలివాన
చిత్రం : జగన్ (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా
రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా
ఉప్పెనలా వచ్చింది గాలివాన...
ఉప్పెనలా వచ్చింది గాలివాన... గుచ్చి గుచ్చి పోతుంది గుండెలోనా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
చరణం 1 :
ఊగిఊగిపోతుంది మనసు మొక్కలా...
ఎగిరి ఎగిరి పడుతుంది వయసు మొగ్గలా
ఊగిఊగిపోతుంది మనసు మొక్కలా...
ఎగిరి ఎగిరి పడుతుంది వయసు మొగ్గలా
వణికి వణికి పోతుంది చూపు పువ్వులా
తడిసి తడిసి పోతుంది ఆశ పిందెలా
చెప్పకుండా వచ్చింది పాడు వానా
దంచి దంచి కొడుతుంది ఎండలోనా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా
ఉప్పెనలా వచ్చింది గాలివాన...
ఉప్పెనలా వచ్చింది గాలివాన... గుచ్చి గుచ్చి పోతుంది గుండెలోనా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
చరణం 2 :
కురిసి కురిసి ఆగింది కొండ చాటుగా
ఆగి ఆగి ఉరిమింది కొంటె పిలుపుగా
కురిసి కురిసి ఆగింది కొండ చాటుగా
ఆగి ఆగి ఉరిమింది కొంటె పిలుపుగా
పిలిచి పిలిచి తప్పుకుంది సిగ్గు చేరగా
నన్ను కోరి ఒప్పుకుంది తోడు నీడగా
దేవుడల్లే వచ్చింది వెండి వానా
మూడుముళ్ళు వేసింది జన్మలోనా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా
ఉప్పెనలా వచ్చింది గాలివాన...
ఉప్పెనలా వచ్చింది గాలివాన... గుచ్చి గుచ్చి పోతుంది గుండెలోనా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2716
Friday, July 22, 2016
పదహారేళ్ళ వయసు
చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
చరణం 1 :
రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు
చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు
లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే.. రాజుకుంటే
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
చరణం 2 :
పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు.. లోన చూడ వగరు
పిల్ల కాదు పిడుగు.. గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు.. దోచుకోని సరుకు
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల.. చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
Friday, September 11, 2015
పందొమ్మిదివందల ఎనభై వరకు
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: సుశీల, బాలు
పల్లవి :
పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు
పడినా ....నే వెంటపడలేదు
ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా
ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా
పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు
పడినా ....నే వెంటపడలేదు
ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా
ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా
చరణం 1 :
ఆరేళ్ళ ముందు చూస్తే.. చిన్నపిల్ల
పదహారేళ్ళ వయసునాడు .కుర్రపిల్ల
ఆరేళ్ళ ముందు చూస్తే.. చిన్నపిల్ల
పదహారేళ్ళ వయసునాడు ...కుర్రపిల్ల
ఏడు పెరుగుతుంటే.. ఈడు పెరుగుతుంది
ఈడు పెరుగుతుంటే ..జోడు కుదురుతుంది
ప్రేమకు ఈడెందుకూ? పెళ్ళికి ప్రేమెందుకు?
ప్రేమకు పెళ్లితోడు ..పెళ్ళికి ప్రేమతోడు
అమ్మతోడు ..అయ్యతోడు.. నీకు నాకు... ఈడుజోడు ...
హోయ్ .. హోయ్.. పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు
పడినా ....నే వెంటపడలేదు
ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా
ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా
చరణం 2 :
మొదటిసారి చూచినపుడు.. అగ్గిరాముడు...
మరి మూడేళ్ల ముందుచూస్తే ..అడవిరాముడు..
మొదటిసారి చూచినపుడు.. అగ్గిరాముడు
మరి మూడేళ్ల ముందుచూస్తే ..అడవిరాముడు
ఏడు పెరుగుతుంటే ..వయసు తరుగుతుంది
వయసు తరుగుతుంటే.. సోకు పెరుగుతుంది
మనసుకు సోకెందుకు ? వయసుకు మనసెందుకు?
మనిషికి మనసు అందం.. మనసుకు ప్రేమబంధం
ఈ అందం ..ఆ బంధం.. ఇద్దరిది ...వివాహబంధం
హోయ్! పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు
పడినా ....నే వెంటపడలేదు
ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా
ఓ అందాలయ్యా ...చూపే దండాలయ్యా...
పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు
పడినా ....నే వెంటపడలేదు
ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా
ఓ బంగారక్కా .. చూపే శృంగారక్కా
హల్లో.. టెంపర్
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
వోయ్.. వోయ్.. వోయ్ వోయ్..
హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
పైలా పచ్చీస్.. పైలాపచ్చీస్ బుల్లెట్ బండి...
అర్రే.. పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి !!
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్ ..
చరణం 1 :
ఎండకు కందే.. సుకుమారుల్లా... ఉన్నారు మీరు
ముందుకు వెనుక.. తెలియక నాపై... దాడికి వచ్చారు
మాట మాట పెరిగితే.. నే మోటుతనానికి దిగితే...
అర్రె కర్రో కత్తో విసిరితే.. మీ కాలో చెయ్యో విరిగితే
మీ పెళ్ళి కాస్త గోవిందా.. గోవిందా..
మీకు మొగుడే రాడు గోవిందా.. భజగోవిందా.. గోవిందా
పెళ్ళి కాస్త గోవిందా.. గోవిందా..
మీకు మొగుడే రాడు గోవిందా.. భజగోవిందా..
అహ...హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్..
చరణం 2 :
ముద్దు ముచ్చట తీరుస్తా.. ముట్టుకోనీ నిన్నూ...
పగలే చుక్కలు పొడిపిస్తాలే.. ముద్దు పెట్టుకోనీ నన్ను..
కాదని విర్రవీగితే.. కయ్యానికి కాలు దువ్వితే
టక్కు నిక్కు చూపితే.. నాలో తిక్కరేగితే
నీ టాపు లేచిపోతుంది గోవిందా....
నీ షేపు మారిపోతుంది భజగోవిందా గోవిందా..గోవిందా...
టాపు లేచిపోతుంది గోవిందా ..
నీ షేపు మారిపోతుంది గోవిందా.. భజగోవిందా...
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్ ..
హల్లో...హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్ ..
పైలా పచ్చీస్.. పైలాపచ్చీస్ బులెట్ బండీ..
అర్రే... పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి
రాటుదేలి.. రచ్చకెక్కి.. ఢీ కొన్నాయండి...
హల్లో... టెంపర్.. ఓ.. విజయా సూపర్..
హల్లో.. టెంపర్.. ఓ.. విజయా సూపర్..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=353
జ్యోతిలక్ష్మి చీరకట్టింది
చిత్రం : సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
నమస్కారమండి... ఆయ్.. అవునండి
అయ్యబాబోయ్... ఆ ఈలలెందుకండి.. వచ్చేశానుగా
మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి
"వాయించరా సచ్చినోడా ఊపు కావాలి"
ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ ఓటేల్ కెళ్ళానండి
రూము కావాలి అన్నాను...
డబలా? సింగలా? అన్నాడు.. డబలే అన్నాను
ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు... ఏ.సి.యే అన్నాను
పేరు అన్నాడు... "జ్యోతిలక్ష్మి" అన్నాను
అనగానే గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు...
గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు..
అతుక్కున లేచాడు.. పుటుక్కున విరిచాడు
అతుక్కున లేచాడు.. పుటుక్కున విరిచాడు
గుర్కా రామ్ సింగ్.. ఆపరేటర్ అజిత్సింగ్
కిళ్ళీకొట్టు కిషన్ సింగ్.. పేపర్ స్టాల్ ధారాసింగ్
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు
ఏమని అరిచారో తెలుసా ....
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
అయ్యో... బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...
బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...
అని చెప్పి గోల గోల చేసి...
చివరికి రూము నెంబరు నూట పదకొండు ఇచ్చాడు
తీరా తలుపు తెరిచి చూస్తే ..
చరణం 1 :
మంచం పక్కన పగిలిన... గాజు ముక్కలు...
మంచం క్రింద నలిగిన... మల్లెమొగ్గలు
మంచం మీద మిగిలిన... ఆకువక్కలు
మంచం మీద చాటున వొలికిన... పాల చుక్కలు.. పాల చుక్కలు...
కంగారు పడి ఏమిటా అని అడిగాను
ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు...
మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు...
ఆ నిద్దర్లు నాకెప్పుడా అని...
ఆ మంచం మీదే పడుకున్నాను..
పడుకోగానే...
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... డర్ డర్ డర్ మని బెల్లు
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... డర్ డర్ డర్ మని బెల్లు
ధన్ ధన్ ధన్ మని తలుపు.. ధన్ ధన్ ధన్ మని తలుపు
రా రా రా రమ్మని పిలుపు... రా రా రా రమ్మని పిలుపు
ఏమిటా అని తలుపు తీశాను...
తియ్యగానే...
ఫస్టుఫ్లోరు పాపయ్య.. రెండో ఫ్లోరు రంగయ్య
ఆయ్.. మూడోఫ్లోరు ముత్తయ్య.. లిఫ్ట్ బాయ్ లింగయ్య
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు...
ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు...
ఏమని?
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది...
అయ్యో.. బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది..
బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...
చరణం 2 :
ఆ తరువాత ఎలాగూ మా ఇంటికి వెళ్ళిపోయాను
తీరా ఇంటికి వెళితే...
గుమ్మానికి మామిడి తోరణాలు...
ఇళ్ళంతా మనుషుల... తిరనాళ్ళు
గదిలో కొత్తవి ఆభరణాలు... గదిలో కొత్తవి ఆభరణాలు
చూసి.. చూడని.. నవ్వుల బాణాలు...
కంగారు పడిపోయి అండి... ఏమిటా అని అడిగానుఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు...అతను చూస్తాడు త్వరగా రమ్మని.. నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు
కూర్చో గానే ...
పెళ్ళికొడుకు తమ్ముడు... తమ్ముడుగారి తండ్రి
హెయ్... తండ్రిగారి తాత... ఆ తాతగారి మనవడు
అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు
అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు
ఏమనో తెలుసా?
జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో... జ్యోతిలక్ష్మి చీరకట్టింది... పాపం చీరకే సిగ్గేసింది
అయ్యో... బొట్టుకే భయమేసింది... ఊరంతా హోరెత్తింది..
బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది...
అని కోపంగా ఎళ్ళిపోయారు...
ఆ అందరి కోసం అలా ఉండమంటారా...
ఇలా చీరకట్టుకోమంటారా...
Wednesday, August 5, 2015
ఉయ్యాలకు వయసొచ్చింది
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
ఉయ్యాలకు వయసొచ్చింది... ఊపి ఊపి చంపేస్తుంది
ఉయ్యాలకు వయసొచ్చింది... ఊపి ఊపి చంపేస్తుంది
ఏ దేవి తంత్రమో... శ్రీదేవి ..మంత్రమో ..
ఏ దేవి తంత్రమో... శ్రీదేవి ..మంత్రమో... తెలియాలి ఆ గుట్టు ఈ దేవికి
ఉయ్యాలకు వయసొచ్చింది... ఊపి ఊపి చంపేస్తుంది
ఉయ్యాలకు వయసొచ్చింది... ఊపి ఊపి చంపేస్తుంది
ఏ దేవుడి తంత్రమో... ఈ రాముని మంత్రమో ..
ఏ దేవుడి తంత్రమో... ఈ రాముని మంత్రమో ..
తెలియాలి ఆ గుట్టు రాముడికి...
చరణం 1:
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
అడుగు తీసి అడుగెయ్యనా .. నీ అడుగులోన అడుగెయ్యనా
అడుగు తీసి అడుగెయ్యనా .. నీ అడుగులోన అడుగెయ్యనా
నే అనుకున్నది అడిగెయ్యనా ...అడగకుండా వదిలెయ్యనా
చల్లకొచ్చి.. ముంతదాచి ..పండు తెచ్చి .. దాచిపెట్టి ..
వాటెయ్యకు .. వదిలెయ్యకు.. చెప్పకుండ చంపేయ్యకు ...
అనుకున్నది చెప్పకుండ చంపెయ్యకు ...
ఉయ్యాలకు వయసొచ్చింది.. ఊపి ఊపి చంపేస్తుంది
చరణం 2 :
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
గుండెలోన ఇల్లేయ్యనా ..ఆ ఇంటిలోన నిన్నుంచనా
గుండెలోన ఇల్లేయ్యనా ..ఆ ఇంటిలోన నిన్నుంచనా
అర్ధరాత్రి వచ్చేయ్యనా ..మనసైనది చెప్పేయ్యనా
చెప్పకుండా.. చెయ్యకుండా.. రాకుండా.. ఉండకుండా ..
ఊరించకూ.. ఉడికించకూ ..దాచేసి మాటాడకు ...
అనుకున్నది... దాచేసి మాటాడకు ...
ఉయ్యాలకు వయసొచ్చింది.. ఊపి ఊపి చంపేస్తుంది...
ఏ దేవి తంత్రమో... శ్రీదేవి మంత్రమో
ఏ దేవుడి తంత్రమో... ఈ రాముని మంత్రమో ..
తెలియాలి ఆ గుట్టు ఈ దేవికి ...
ఉయ్యాలకు వయసొచ్చింది.. ఊపి ఊపి చంపేస్తుంది...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=843
Monday, January 12, 2015
నిన్నే పెళ్లాడుతా
చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నిన్నే పెళ్లాడుతా.. నిన్నే పెళ్ళాడుతా
రాముడు.. భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు.. అగ్గి రాముడు.. టైగర్ రాముడు.. శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా.. రాముడు..భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు.. అగ్గి రాముడు.. టైగర్ రాముడు.. శభాష్ రాముడు.. నిన్నే పెళ్ళాడుతా
చరణం 1 :
శాంత.. రామ.. వివాహబంధం.. సీతారామ కళ్యాణ౦
శాంత.. రామ.. వివాహబంధం.. సీతారామ కళ్యాణ౦
ఇంటికి దీపం ఇల్లాలే.. ఇంటికి దీపం ఇల్లాలే.. కలసి ఉంటే కలదు సుఖం
నిప్పులాంటి మనిషి.. ఎదురులేని మనిషి..
ఆత్మబందువే.. అగ్గిబరాటా.. ఆత్మబందువే.. అగ్గిబరాటా
చిక్కడు దొరకడు.. కదలడు వదలడు.. నిన్నే పెళ్ళాడుతా
చరణం 2 :
జగదేక వీరుని మంగళసూత్ర౦.. ఈ ఆడబ్రతుకున కంచుకోట
జగదేక వీరుని మంగళసూత్ర౦.. ఈ ఆడబ్రతుకున కంచుకోట
దాసిని.. చరణదాసిని.. దాసిని.. చరణదాసిని
భీష్మా.. కాదా మంగమ్మ శపధం
భీష్మా.. కాదా మంగమ్మ శపధం
దేషోద్దారకా.. కథానాయకా.. దేవా౦తక... జయసింహా
వీర కంకణ౦.. నా సంకల్పం.. దాన.. వీర.. శూర.. కర్ణా.. నిన్నే
నిన్నే పెళ్ళాడుతా.. రాముడు.. భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు.. అగ్గి రాముడు.. టైగర్ రాముడు.. శభాష్ రాముడు.. నిన్నే పెళ్ళాడుతా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=321
Sunday, August 31, 2014
జివ్వుమని కొండగాలీ
చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : దాసరి
నేపథ్య గానం : మనో, జానకి
పల్లవి :
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతం
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..దొరికిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...
చరణం 1 :
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీర కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీర వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
చరణం 2 :
మంచల్లే కరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలూ
కొమ్మల్లో పూలన్ని పానుపుగా మన ముందుంచె పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలని మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుందీ
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ..
Labels:
(ల),
chiranjeevi,
జానకి,
దాసరి,
మనో,
రాజ్-కోటి,
లంకేశ్వరుడు (1989)
Tuesday, August 26, 2014
ఒక లైలా కోసం
చిత్రం : రాముడు కాదు కృష్ణుడు (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ .. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా... లైలా... లైలా
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ... మజ్ఞూ... మజ్ఞూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
చరణం 1 :
ఆకాశానికి నిచ్చెన వేసీ... చుక్కల పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ...
స్వర్గానికి నే దారులు వెతికీ.. ఇంద్రుని పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ
దిక్కుల నడుమా నేనుంటే.. చుక్కల పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ నేనుంటే.. కన్నులు మూసుకు వెదికావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ... ప్రతి చోటా నీ కోసం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. ప్రతి తలపూ అతని కోసం
లైలా...లైలా...లైలా
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
చరణం 2 :
పగలూ రేయీ పందెం వేసీ.. సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్ఞూ ఏడనీ.. నా మజ్ఞూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ.. స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ
ఇల్లూ వాకిలి వదిలొస్తే రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే.. ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ.. ప్రతి తలపూ నీ కోసం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ .. ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ...మజ్ఞూ...మజ్ఞూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ.. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా...లైలా...లైలా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1893
Subscribe to:
Posts (Atom)