Showing posts with label మౌనశ్రీ మల్లిక్. Show all posts
Showing posts with label మౌనశ్రీ మల్లిక్. Show all posts

Wednesday, January 30, 2013

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ

చిత్రం: చేతిలో చెయ్యేసి (2010)
సంగీతం: బంటి
గీతరచయిత: మౌనశ్రీ మల్లిక్
నేపధ్య గానం: కార్తీక్, గీతా మాధురి

పల్లవి:

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే
చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం .. మత్తుగా ఉన్నదే నీ అనురాగం
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం .. మత్తుగా ఉన్నదే నీ అనురాగం
చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ

చరణం 1:

సుధలు చిందు కావ్యం చదివా ఓ నేస్తమా
తెలుగు భాష పరువం నీవే ఓ అందమా
కలలు కనే వయసిది తెలుసా నా ప్రియతమా
కన్నె గుండె అలజడి తెలుసా నా ప్రాణమా

నువ్విలా పాడితే మది వాసంతం
నన్నిలా మీటితే ఎద సంగీతం
హే నువ్విలా పాడితే మది వాసంతం
హే నన్నిలా మీటితే ఎద సంగీతం

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ

చరణం 2:

విరులవాన గానం నాదీ ఓ నాదమా
నవరసాల వదనం నీదీ నా వేదమా
సిరులు కురియు సొగసే నాదీ ఓ ప్రణయమా
మరులుగొన్న మనసే నీదీ నా వినయమా

గుండెలో దేవిగా పూజిస్తాలే
కంటిలో పాపగా కొలువుంటాలే
హో గుండెలో దేవిగా పూజిస్తాలే
హే కంటిలో పాపగా కొలువుంటాలే

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం .. మత్తుగా ఉన్నదే నీ అనురాగం
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం .. మత్తుగా ఉన్నదే నీ అనురాగం