Sunday, July 29, 2012

అగ్గిపుల్ల భగ్గుమంటది


చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, జానకి


పల్లవి:

హా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ..
హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో... కౌగిలింతలో.. నీ చింత తీర్చేసుకో

అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
అప్... అప్...అప్... అప్.....అగ్గిపుల్ల అంటుకుంటదీ ..
హ..హ..హ..హ..ఆడపిల్ల జంటగుంటదీ...
అందమిప్పుడే అంటగట్టుకో... నీ ముద్దు తీర్చేసుకో

అహా.. అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ..


చరణం 1:


చూపు తాకిడి సుఖమేముందీ.. చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే.. చూసుకో మరి నా ఇష్టం
చూపు తాకిడి సుఖమేముందీ.. చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే.. చూసుకో మరి నా ఇష్టం

దొంగ చేతిలో తాళం ఉందీ.. తాళం ఎప్పుడూ కప్పుకు ఉందీ..
అంగుళానికో అందం ఉందీ.. బేరమప్పుడే పెంచుతు ఉంది

చౌక బేరమే ..సోకు లాభమే...ఘరానాదొంగకి

అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హా...ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో... కౌగిలింతలో ..నీ చింత తీర్చేసుకో

అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..


చరణం 2 :


దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా.. దోచుకుంటే నా కిష్టం
దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా.. దోచుకుంటే నా కిష్టం

కంటి చూపులో గారం ఉందీ... వంటి నిండ బంగారం ఉందీ...
కన్నె చూడనీ నేరం ఉందీ... కమ్ముకుంటే శృంగారం ఉందీ..

సొంత లాభము కొంత మానుకో... ఫలానా వేళకి..

అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో... కౌగిలింతలో.. నీ చింత తీర్చేసుకో

అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..ఓ..

No comments:

Post a Comment