Thursday, August 9, 2012

చిగురేసే మొగ్గేసే

చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపథ్య గానం: బాలు, సుశీల




పల్లవి:




చిగురేసేమొగ్గేసే సొగసంత పూతపూసే.. చెయ్యైన వెయ్యవేమి?.. ఓ బాపూదొర
చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాపూదొర ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..

చిగురేసే మొగ్గేసే సొగసంత పూతపూసే ఇవ్వాలని లేదా ఏమి?
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి?.. ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..



చరణం 1:


ముట్టుకుంటే ఉలికిపడతావ్ .. పట్టుకుంటే జారిపోతావ్
ముట్టుకుంటే..ఏ..ఏ.. ఉలికిపడతావ్... పట్టుకుంటే జారిపోతావ్..

నీ చూపుల్లో వుంది సూదంటూ రాయి
అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి...

చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే.. చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాపూదొర
చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాపూదొర ఉయ్యాలలూపవేమీ.. ఈ..ఈ..ఈ..




చరణం 2:



చేరుకుంటే ఊరుకుంటావ్.. వల్లకుంటే గిల్లుతుంటావ్...
చేరుకుంటే..ఈ..ఈ ఊరుకుంటావ్.. వల్లకుంటే...ఏ..ఈ గిల్లుతుంటావ్..

నీ చేతుల్లో వుందీ చెకుముకిరాయీ..
అది రాసుకుంటే చురుకైన హాయి..

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ఇవ్వాలని లేదా ఏమి?
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి?.. ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..



చరణం 3:




నిన్ను కట్టుకోవాలని మనసౌతాది... చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..
నిన్ను కట్టుకోవాలని మనసౌతాది... చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..


గుబులెందుకుకింకా గారాల చిలకా..
ఎగిరెగిరి పోదాము నెలవంక దాక...

No comments:

Post a Comment