Monday, December 10, 2012

నేనా పాడనా పాటా

చిత్రం: గుప్పెడు మనసు (1979) 
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం 

పల్లవి: 

నేనా .. పాడనా పాటా 
మీరా .. అన్నదీ మాటా 

నేనా .. పాడనా పాటా 
మీరా .. అన్నదీ మాటా 

నీ వదనం భూపాలమూ .. నీ హృదయం ధ్రువతాళమూ 
నీ సహనం సాహిత్యమూ .. నువ్వు పాడిందే సంగీతమూ 

నేనా .. పాడనా పాటా 
మీరా .. అన్నదీ మాటా 

ఇల్లే సంగీతమూ .. వంటిల్లే సాహిత్యమూ 
ఈ పిల్లలే నా సాధనం .. ఇంకా వింటారా నా గానం 
ఇల్లే సంగీతమూ .. వంటిల్లే సాహిత్యమూ 
ఈ పిల్లలే నా సాధనం .. ఇంకా వింటారా నా గానం 

ఊగే ఉయ్యాలకూ .. నువు పాడే జంపాలకూ 
ఊగే ఉయ్యాలకూ .. నువు పాడే జంపాలకూ 
సరితూగదు ఏ గానమూ .. నీకు ఎందుకు సందేహమూ 

నీకు ఎందుకు సందేహము...

ఉడకని అన్నానికీ .. మీకొచ్చే కోపానికీ 
ఏ రాగం బాగుండునో .. చెప్పే త్యాగయ్య మీరేగా 
ఉడకని అన్నానికీ .. మీకొచ్చే కోపానికీ 
ఏ రాగం బాగుండునో .. చెప్పే త్యాగయ్య మీరేగా 

కుత కుత వరి అన్నం .. తై తక తక మను నాట్యం 
ఏ భరతుడు రాసిందీ .. నీకా పదునెటు తెలిసిందీ 

నీకా పదునెటు తెలిసింది...

నేనా .. పాడనా పాటా 
మీరా .. అన్నదీ మాటా 

నీ వదనం భూపాలమూ .. నీ హృదయం ధ్రువతాళమూ 
నీ సహనం సాహిత్యమూ .. నువు పాడిందే సంగీతమూ

No comments:

Post a Comment