చిత్రం: ఖైదీ (1983)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
మెర మెర మెరుపుల మేనకనీ
ప్రణయ కంకనపు సారికనీ
మనసిత మలయిజ వీచికనీ
మాం పా సిస్తే నీసేవికనే
నా గాధ వినరా గాధేయా
నా గాధ వినరా గాధేయా
నీ తపము మాని నా తపన తీర్చరా
జపములేలరా... రసజగము లేలరా
సురలు నరులు చూడలేని సుఖము నీదిరా
ఇగిరింది ఇగిరింది తన ఉదక మండలం
సడలింది సడలింది ముని తపోనిశ్చయం
నిష్టుర నీరస నిశ్చల తాపసి హృదయం
గెలిచింది ఆ క్షణమే మేనక ప్రణయం
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
అందాలో జన్మ గంధాలో రాగ బంధాలో
శకుంతమై వసంత గీత మాలపించగా
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
చరణం 1:
ఋషి కత మారే రసికత మీరే
చెలి నీ కౌగిళ్ళకే స్వర్గాలెన్నో చేరే
సరసకు చేరే సరసుని కోరే
వలపు వాకిళ్లల్లో సాక్షాలెన్నో తోచే
యజ్ఞము యాగము హోమము నియమము నీరాయే నీ చూపుకే మోహినీ
అందము చందము నవ్విన యవ్వన రాగాలు నీకోసమే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
మల్లెల బాణం తగిలెను ప్రాణం
రగిలే దాహాలలో మోహాలెన్నో రేగే
మదవతి రూపం మదనా లాపం
పిలిచే రాగాలలో లోకాలన్నీ ఊగే
ఇంద్రుడు చంద్రుడు జీవుడు దేవుడు నీ రూపమైపోయే ఓ కౌశికా
మంత్రము శాస్త్రము యోగము భోగము నే ధారపోశానులే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
అందాలో జన్మ గంధాలో రాగ బంధాలో
శకుంతమై వసంత గీత మాలపించగా
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9332
వ్యతము లేలరా / జపములేలరా
ReplyDeleteసోమము / హోమము
గాధేయా / గార్గేయా
కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు కాబట్టి ఆయన్ని గాధేయుడు అని అంటారు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది. Thanks for correcting వ్యతము లేలరా / జపములేలరా
Deleteసోమము / హోమము.