Tuesday, December 4, 2012

ఓ మై లవ్లీ డార్లింగ్

చిత్రం: కిలాడీ బుల్లోడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్..ఊ..ఊ..
నీ బుగ్గలలో నిగ నిగ లాడే సిగ్గుమొగ్గలే.. బ్లూమింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్ ..ఊ.. ఊ
నీ కన్నులలో తళతళ లాడే చిలిపి తలపులే.. చామింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్

చరణం 1:

మురిపించే నీ అందం... వేసింది తొలిబంధం
పిలుపులలో తియ్యదనం... చిలికింది మకరందం
ఆశలు పొంగే ఈ సమయంలో... నీ చిరునవ్వే.. ఎగ్జైటింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్...

చరణం 2:

లా...లా...లా...లా...
ఆహ...ఆహ....ఆహ...ఆహ...
లా...లా....లా....లా...
ఆహ..ఆహ...ఆహ...ఆహ...

విరబూసే విరజాజి... తెలిపింది సందేశం...
అందుకనే తుమ్మెదలో... కలిగిందీ ఆవేశం...
జీవితమంతా చెరిగిపోనిది... మధురమైనదీ.. మీటింగ్..

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్...

చరణం 3:

అదిగదిగో ఆకాశం... వాలిందీ మనకోసం
కొండలలో కోనలలో... నిండిందీ అనురాగం
నీవు నేను కలిసిన వేళ... నిమిష నిమిషమూ.. థ్రిల్లింగ్...

ఓ మై లవ్లీ డార్లింగ్...
లెట్ మీ టెల్ యు సమ్ థింగ్...
ఓ మై లవ్లీ డార్లింగ్...

No comments:

Post a Comment