Saturday, December 15, 2012

గువ్వ గోరింకతో

చిత్రం : ఖైదీ # 786 (1988) 

సంగీతం : రాజ్-కోటి 

గీతరచయిత : భువనచంద్ర 

నేపధ్య గానం : బాలు, జానకి 


పల్లవి: 

అతడు : గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 

ఆమెనిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 

అతడుఆడుకోవాలి గువ్వలాగ .. పాడుకుంటాను నీ జంట గోరింకనై 

అతడు : గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 

ఆమె :  నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 


చరణం 1: 

అతడు : జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు 

ఆమె : అయ్యొపాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు 

అతడు : ఆత్రమూ.. ఆరాటమూ .. చిందే వ్యామోహం 

ఆమె : ఊర్పులో .. నిట్టూర్పులో.. అంతా నీ ధ్యానం 

అతడు : కోరుకున్నానని ఆట పట్టించకు 

ఆమె : చేరుకున్నానని నన్ను దోచేయకు 

అతడు : చుట్టుకుంటాను సుడిగాలిలా ...

అతడు : హోయ్... గువ్వ..  హా.. గోరింకతో...  హా.. ఆడిందిలే బొమ్మలాట 

ఆమె : హోయ్.. నిండు.. హా....నా గుండెలో ... హా.. మ్రోగిందిలే వీణపాట..  హోయ్.. హోయ్.. 


చరణం 2: 

ఆమె : కొండనాగు తోడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం 

అతడు : సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం 

ఆమె : పువ్వులో .. మకరందము .. ఉందే నీ కోసం 

అతడు : తీర్చుకో .. ఆ దాహము .. వలపే జలపాతం 

ఆమె : కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 

అతడు : దూరముంటానులే దగ్గరయ్యేందుకు 

ఆమె : దాచిపెడతాను నా సర్వమూ ... 

అతడు : హోయ్... గువ్వ..  హాయ్.. గోరింకతో...  హాయ్.. ఆడిందిలే బొమ్మలాట 

ఆమె : అహా.. నిండు.. హా....నా గుండెలో ... హా.. మ్రోగిందిలే వీణపాట.. 


అతడు, ఆమె : ఆడుకోవాలి గువ్వలాగ .. పాడుకుంటాను నీ జంట గోరింకనై 


No comments:

Post a Comment