Saturday, July 27, 2013

ఈ రాతిరీ ఓ చందమామా

చిత్రం: దొంగలకు దొంగ (1977)
సంగీతం: సత్యం
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఈ రాతిరీ ఓ చందమామా..
ఎట్లా గడిపేదీ అయ్యో రామా..
ఈ రాతిరీ ఓ చందమామా..
ఎట్లా గడిపేదీ అయ్యో రామా..

చాటుగ నను చేరి అల్లరి పెడుతుంటె నీతో వేగేదెలా..
ఈ రాతిరీ ఓ చందమామా..ఎట్లా గడిపేదీ అయ్యో రామా..

చరణం 1:

వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేసేవూ
గిలిగింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేవూ
ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరు
నీతో గడిపేదెలా...

ఈ రాతిరీ ఓ చందమామా..
ఎట్లా గడిపేదీ అయ్యో రామా

చరణం 2:

నిన్ను చూసి లేత కలువ విరిసిందీ
తెల్లవార్లూ మోటు సరసం తగదందీ
ఒకసారి ఔనంటె వదిలేది లేదంటె
ఎట్లా తాళేదిరా...

ఈ రాతిరీ ఓ చందమామా..
ఎట్లా గడిపేదీ అయ్యో రామా..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3154

No comments:

Post a Comment