Thursday, August 1, 2013

అదిగదిగో గగనసీమ

చిత్రం: నా ఇల్లు (1953)
సంగీతం: చిత్తూరు నాగయ్య, అద్దెపల్లి
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: వసంతకుమారి, బాలసరస్వతి

పల్లవి:

అదిగదిగో గగనసీమ.. అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి

చరణం 1:

హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూల వనం నీ సర్వం ప్రేమ ధనం
మరువకోయి ఈ సత్యం

చరణం 2:

నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలి పైన తీయనైన కోరికలు

చరణం 3:

చెరుపుకోకు నీ సౌఖ్యం చేతులార ఆనందం
యేనాడును పొరపడకోయ్ ..
యేనాడును పొరపడకోయ్ యేమైన తొరపడకోయ్
మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమధనం
చివురింపదు తిరిగీ వాడి చెడిన పూలవనం
మరువకోయి ఈ సత్యం

No comments:

Post a Comment