Thursday, February 27, 2014

హృదయమా ఓ బేల హృదయమా

చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:

హృదయమా... ఓ బేల హృదయమా..
ఒకేసారిగ నీకింత సంతోషమా... హృదయమా.. ఆ.. ఆ..

చరణం 1:

తీయని ఊహాలు హాయిగ నీలో మరల చిగిర్చె సుమా ...
మరల చిగిర్చె సుమా ..
పూచిన పూవులు నోచిన నోములు కాచి ఫలించు సుమా.. 
అవి కాచి ఫలించు సుమా

హృదయమా... ఓ బేల హృదయమా...
మనసు తెలుపుగా నీకింత మొమోటమా
హృదయమా...

చరణం 2:

తీగెలు సడలిన సితార తాను తిరిగి మ్రోగె సుమా... 
తిరిగి మ్రోగె సుమా ..
మ్రోగిన పాటే మోహానమై అనురాగము నించె సుమా... 
అనురాగము నించె సుమా ...

హృదయమా... ఓ బేల హృదయమా..
ఒకేసారిగ నీకింత సంతోషమా..
హృదయమా...

చరణం 3:

అందారాని ఆ చందమామ నీ చెతికి అందె సుమా.. 
చెతికి అందె సుమా..
చందమామ నీ చేతులలోనే బంధీ  అగును సుమా... 
ఇక బంధీ  అగును సుమా...

హృదయమా... ఓ బేల హృదయమా...
మనసు తెలుపుగా నీకింత మొమోటమా
హృదయమా... ఆ.. ఆ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7124

No comments:

Post a Comment