Thursday, March 20, 2014

ఒయ్యార మొలికే చిన్నదీ

చిత్రం : మంగమ్మ శపధం (1965)

సంగీతం : టి.వి. రాజు

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఓ.. ఓ.. ఓ..
ఒయ్యార మొలికే చిన్నదీ.. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది..
ఆ.. ఆ.. ఆ..
సయ్యాటలాడే ఓ దొరా.. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా... 


చరణం 1:


ఇంతలోనే ఏ వింత నీలో.. అంత తొందర కలిగించెను
చెంత నిలిచిన చిన్నారి చూపే.. అంతగా నన్ను కవ్వించెను
మనసే చలించెను.. అనురాగ వీణ పలికించెను
ఆ.. ఆ.. ఆ..


సయ్యాటలాడే ఓ దొరా.. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...


చరణం 2:


ఒయలు చిలికే నీ కళ్ళలోని.. ఓర చూపులు ఏమన్నవి
నగవు లొలికే నా రాజులోని.. సొగసులన్ని నావన్నవి
తలపే ఫలించెను.. తొలి ప్రేమ నేడు చిగురించెను
ఓ.. ఓ.. ఓ..


ఒయ్యారమొలికే చిన్నదీ.. ఉడికించుచున్నదీ

రమ్మంటే రాను పొమ్మనది..



No comments:

Post a Comment