Tuesday, June 17, 2014

కదిలే కోరికవో

చిత్రం :  మల్లె పందిరి (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి:


హే హే హే హే హే హా హా హా హా హా


కదిలే కోరికవో.. హా
కథలో నాయికవో.. అహా
కవితా కన్యకవో.. ఆహా
భువిలో తారకవో.. ఆహా
ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం


ల ల లలల.. హ హ హ


వలచే గోపికని.. హా
కొలిచే రాధికని.. ఒహో
మనసే కానుకని.. ఆహా
మురిసే బాలికని.. ఓహో
ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం


చరణం 1:


జాజిమల్లి వానజల్లులోనా..
జలకాలాడే జాణ సింగారాలే నావిగా ... లా ల లా
సందె గాలి 
తావి చిందులోనా..

అందాలన్ని ముద్దమందారాలై నావిగా ... హా హా హా

ఏ వంక లేని వంక జాబిల్లి
నా వంక రావే నడిచే రంగవల్లి


అందుకో కమ్మని ఆమని ప్రేమని


కదిలే కోరికవో.. హా
కథలో నాయికవో.. అహా
కవితా కన్యకవో.. ఆహా
భువిలో తారకవో.. ఆహా
ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం


చరణం 2:


కోనసీమ కొత్త కోక గట్టి..
గోదారమ్మ పొంగే కొంగు చుట్టి..
లీలగా ... హా హా హా
కోయిలమ్మ ఇంటి కున్నలమ్మ
గొంతు దాటి కొత్త పాట పాడి
తియ్యగా ... లా ల లా
నీవంకే వాలే నింక రాచిలక
చిలకమ్మ కోరే గూడె గోరింక


పంచుకో గూడుని గువ్వని గుండెని....


వలచే గోపికని.. హా
కొలిచే రాధికని.. అహా
మనసే కానుకని.. ఏహే
మురిసే బాలికని.. ఓహో
ఓ ప్రియా.. ఆహాహా.. ఓ ప్రియా.. ఆహహా..

నీకిదే.. లలలా..స్వాగతం


No comments:

Post a Comment