Tuesday, June 17, 2014

తొలి చూపు తోరణమాయే

చిత్రం :  మల్లె పందిరి (1981)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి


పల్లవి:


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే..


తొలి చూపు తో 'రణ' మాయే ..
ఉమ్మ్ రాముని తోక ..
సారీ నాకు అచ్చ తెలుగు అంతగా రాదు..
అంటే మిగతా భాషలలో పండితుడని కాదనుకొండి ....


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే


చరణం 1:


పగడాల పెదవులతోనే బిడియాలు కలబడుతుంటే
వగలమారి చెక్కిలి మీద పగటి చుక్క పకపకమంటే
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
కనుచూపు శుభలేఖలుగా
కనుచూపు శుభలేఖలుగా
కళ్యాణ రేఖలు మెరిసే....


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే


చరణం 2:


మనము పసుపు కుంకుమలై
మనువు గడప దాటుతువుంటే
కలిసి బొట్టు కాటుకులై కాపురాన అడుగిడుతుంటే
సిరిగా శ్రీహరిగా.. కలిసే లాహిరిలో...
సిరిగా శ్రీహరిగా.. కలిసే లా..హిరిలో...
నయనాలు ప్రియవచనాలై
నయనాలు ప్రియవచనాలై
అనురాగమే వినిపించే..


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే


తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే..

No comments:

Post a Comment