Saturday, July 5, 2014

నేనే.. నేను నేనే

చిత్రం :  జన్మజన్మల బంధం (1983)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


నేనే.. నేను నేనే...
నేనే.. నేను నేనే...
జగతి నిండిన అందం.. నేనే
జన్మజన్మల బంధం.. నేనే
నేను ఉన్నది నీలోనే...
నేనే.. నేను నేనే...


చరణం 1:


నీ నిజం నేనే.. సగం నేనే
నీవు నేననే పదం.. నేనే
నీ నిజం నేనే.. సగం నేనే
నీవు నేననే పదం.. నేనే


నేను నువ్వై నువ్వు నేనై..
నేను నువ్వై నువ్వు నేనై.. నిలిచిపోయే మనం నేనే
నేను ఉన్నది నీలోనే....
నేనే.. నేను నేనే...


చరణం 2:


ఈ సృష్టి నేనే.. స్థితి  నేనే
అంతు తేలని అణువు నేనే
ఈ సృష్టి నేనే.. స్థితి  నేనే
అంతు తేలని అణువు నేనే


నేను నీలో నీవు నాలో...
నేను నీలో నీవు నాలో...కలిసిపోయే లయం నేనే
నేను ఉన్నది నీలోనే...


నేనే.. నేను నేనే...
జగతి నిండిన అందం.. నేనే
జన్మజన్మల బంధం... నేనే
నేను ఉన్నది నీలోనే...
నేనే.. నేను నేనే...
నేను నేనే...
నేను నేనే...


No comments:

Post a Comment