Thursday, July 3, 2014

చినుకు చినుకుగా

చిత్రం :  ముక్కుపుడక (1983)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, జానకి


పల్లవి:


చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా


చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ


చినుకు చినుకుగా... చిగురు మెత్తగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా


చరణం 1:


అల్లన ఉదయించే ప్రతి కిరణం.. చల్లగ చలియించే నీ చరణం
నింగిని విహరించే ప్రతి మేఘం.. పొంగిన ప్రేమకు సందేశం
ఊహలే ఊసులై.. ఆశలే బాసలై
హే హే..ఊహలే ఊసులై.. ఆశలే బాసలై
మధువులు చిలుకగా మధురిమలొలకగా ప్రణయవేద మంత్రమేదో పలుకగా


చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
ఆహాహా.. గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ
ఆ ఆ చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా


చరణం 2:


వలచిన జంటను కనగానే.. చిలకలకే కన్ను చెదిరిందీ
కవితలకందని పలుకులలో.. కమ్మని దీవెన మురిసిందీ
కడలియే గగనమై.. గగనమే కడలియై
ఆహాహా.. కడలియే గగనమై.. గగనమే కడలియై
సహచరి నడకల స్వరఝరి తొణకగ సరసరమ్య దివ్యసీమ నిలుపగ


చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ


చినుకు చినుకుగా... చిగురు మెత్తగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా

No comments:

Post a Comment