Wednesday, August 27, 2014

విరహ వీణ నిదుర రాక

చిత్రం :  రెండు రెళ్ళు ఆరు (1985)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి


పల్లవి :


విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో..
శృతిని మించి రాగమేదో పలికే వేళలో...
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో...ఓ..
విరహ వీణ...నిదుర రాక వేగే వేళలో..
ఆ..ఆ..వేగే వేళలో...


చరణం 1 :


జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..
సా..పదసరిగ...గా..దపదసరి...గాదపాగ..
గాపరీగ.. సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ...
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...ఆ 
ఆ ఆ ఆ 


జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...
లేలేత వలపు..సన్నాయి పిలుపు ..రావాలి సందిళ్ళ దాకా..
మన పెళ్ళిపందిళ్ళ దాకా..ఆ ఆ ....


విరహ వీణ ..హా....నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో...


చరణం 2 :


ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా..
చీకటిపగలు ..వెన్నెల సెగలు... నీ నీడ కోరేనురా..
ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా..
ఈ దూరమెన్నాళ్ళ దాకా...ఆ..ఆ..


విరహ వీణ ..హా...నిదుర రాక వేగే వేళలో..
శృతిని మించి రాగమేదో పలికే వేళలో...
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో... ఓ..
విరహ వీణ ...నిదుర రాక వేగే వేళలో..వేగే వేళలో


No comments:

Post a Comment