Saturday, September 27, 2014

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము

చిత్రం  :  సీతారామకళ్యాణం (1986)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  బాలు, సుశీల 
పల్లవి :లలలలలలా... లలలలా లలలలలా..
లలలలలలా... లలలలా లలలలలా..
ఊహూహూ.. ఆహహా.. ఓహోహో..
లలాల.. ఆహాహా.. ఓహోహో.. 


రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో


రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో చరణం 1 :కలలన్ని పంటలై పండెనేమో... కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో.. అది నేటి అనురాగ బంధమేమో


తొలకరి వలపులలో.. పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో.. పులకించు హృదయాలలో


యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో
యెన్నెన్ని భావాలో ..రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో


చరణం 2 :
చూశాను యెన్నడో పరికిణిలో.. వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో.. పరువాన పూచిన వన్నెలేవో


వన్నెల వానల్లో.. వనరైన జలకాలలో
వన్నెల వానల్లో.. వనరైన జలకాలలో


మునగాలి తేలాలి.. తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో
యెన్నెన్ని కౌగిళ్ళో..రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

లలలలలలా... లలలలలలా

లలలలలలా... లలలలలలా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10267

No comments:

Post a Comment