Tuesday, September 9, 2014

చల్లని సామివి నీవైతే

చిత్రం :  వీరాభిమన్యు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం  : ఘంటసాల, సుశీల

పల్లవి :

చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ
చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ

చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ 

చరణం 1 :

ముక్కున ముక్కెర అందం కానీ ముచ్చటకది ప్రతిబంధం
ముక్కున ముక్కెర అందం కానీ ముచ్చటకది ప్రతిబంధం
మన ఆనందానికి అడ్డయ్యే ఏ అందమైనా ఎందులకూ? అందమైనా ఎందులకు?..ఊ...

రసమయ హృదయం నీదైతే రతిరాజా కనుమూయకుము
మా ప్రణయం పచ్చగ ఉండే వరకు రణభేరీ మ్రోగకుమూ 

చరణం 2 :

గాజులు చేతికి సొంపు.. ప్రణయానికి అవి సడలింపు
గాజులు చేతికి సొంపు.. ప్రణయానికి అవి సడలింపు
మన అనుబంధానికి అడ్డయ్యే ఈ ఆభరణాలు ఎందులకు? ఆభరణాలు ఎందులకు?

తీరని కోరిక నీదైతే తారా చంద్రుని తరమకుము
ఈ తీయని వెన్నెల దోచుకు పోయే దినరాజును రానీయకుమూ
 
చరణం 3 :

పదముల కందము అందియలూ అవి పలుమరు చేయును సందడులు
పదముల కందము అందియలూ అవి పలుమరు చేయును సందడులు
తలపులు పండే తరుణంలో ఈ సవ్వడులన్నీ ఎందులకు?... సవ్వడులన్నీ ఎందులకు?

చల్లని సామివి నీవైతే .. అల్లన ఆగుము జాబిల్లీ
ఎదలో కరుణే నీకుంటే .. ఉదయం కానీకోయీ

No comments:

Post a Comment