Sunday, September 7, 2014

ఓ దేవి ఏమి కన్నులు నీవి

చిత్రం :  విజయం మనదే (1970)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఓ దేవి ఏమి కన్నులు నీవి
ఓ దేవి ఏమి కన్నులు నీవి
కల కల నవ్వే కలువలు
అవి కాముని పున్నమి చలువలు
ఓ దేవి ఏమి కన్నులు నీవి
వాడిపోయే వీడిపోయే
కొలనులోని కలువపూలు
నా నయనాలా చాలు చాలు చాలూ...
ఓ దేవి ఏమి కన్నులు నీవి



చరణం 1 :


ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు
ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు
రూపమే కాని రుచియే లేని పగడాలు
రూపమే కాని రుచియే లేని పగడాలు
తేనియలూరే తియ్యని పెదవికి సరి రావు సరిరావు
చాలు చాలు చాలు...


ఓ దేవి ఏమి కన్నులు నీవి



చరణం 2 :


కులుకుల నడకల కలహంసలు కదలాడెనా
నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా
కులుకుల నడకల కలహంసలు కదలాడెనా
నల నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా
దివికీ భువికి వంతెన వేసెను నీ సోగసు
దివికీ భువికి వంతెన వేసెను నీ సోగసు
అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను నీ మనసు నీ మనసు
చాలు చాలు చాలు...


ఓ దేవి ఏమి కన్నులు నీవి
ఓ రాజా రసికతారసి రాజా


No comments:

Post a Comment