చిత్రం : సితార (1983)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
కుకుకు కుకుకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే
రాణి వాసము నీకు ఎందుకో... కో కో...
రెక్క విప్పుకో చుక్కలందుకో... కో కో...
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే
చరణం 1 :
రంగుల లోకం పిలిచే వేళ.. రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే.. బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరిపొదల ఎదలకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే
చరణం 2 :
సూర్యుడు నిన్నే చూడాలంట.. చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి రావే.. గడప తలుపు దాటి రావే
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావేకుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావేరాణి వాసము నీకు ఎందుకో.. కో... కో రెక్క విప్పుకో చుక్కలందుకో... కో... కోకుకుకు కుకుకు కోకిల రావే...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13006
No comments:
Post a Comment