Wednesday, September 24, 2014

మౌనమేలనోయి

చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 




పల్లవి : 


మౌనమేలనోయి...
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి


ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 



చరణం 1 : 


పలికే పెదవి వొణికింది ఎందుకో?
వొణికే పెదవి వెనకాల ఏమిటో?


కలిసే మనసులా.. విరిసే వయసులా
కలిసే మనసులా.. విరిసే వయసులా
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు..  ఏమేమో అడిగినా   

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి


చరణం 2 : 


హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట

ఇవి ఏడడుగుల వలపూమడుగుల
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు... ఎంతెంతొ తెలిసిన 


మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయిఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి


ఎదలో వెన్నెల వెలిగే కన్నులఎదలో వెన్నెల వెలిగే కన్నులతారాడే హాయిలో..ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9622

No comments:

Post a Comment