Thursday, September 11, 2014

రాగాలా సరాగాలా

చిత్రం  :  శాంతినివాసం (1960)
సంగీతం  :  ఘంటసాల
నేపధ్య గానం  :  ఘంటసాల, సుశీల




పల్లవి :



ఆ ఆ ఆ ఆ..

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం


రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం



చరణం 1 :


పతిపద సేవయె యోగముగా.. నాతికి పతియే దైవముగా
పతిపద సేవయె యోగముగా.. నాతికి పతియే దైవముగా
సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా
సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా


రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం




చరణం 2 :



మాయని ప్రేమల కాపురమే.. మహిలో వెలసిన స్వర్గముగా
మాయని ప్రేమల కాపురమే.. మహిలో వెలసిన స్వర్గముగా
జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా
జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా


రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం
హా య్.. సుఖజీవన సారం


No comments:

Post a Comment