Saturday, September 27, 2014

నువ్విట్ట.. నేనిట్ట

చిత్రం :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :


నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా
తెల్లారిపోయేదెట్టా.. హా.. ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..
నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా



నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా..హా.. నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..
నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా  




చరణం 1 :



సిటికెంత నవ్వంట.. సికిలింత పువ్వంట..
ఆ పువ్వు కోసుకొంటే.. ఏ.. ఆపేది ఎవరంట..

చీకట్లో సింగారం.. సిటికేసే యవ్వారం..
చీకట్లో సింగారం.. సిటికేసే యవ్వారం..
నీ పొగరంత అణిగేదెట్ట.. ఈ పొగరాని సెగలే సంత


నువ్విట్ట.. నేనిట్ట.. కూకుంటే.. ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా..హా.. నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..
నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా   


చరణం 2 :



మసకేస్తే మనసంట.. మనసైతే వరసంట
ఈ ఘడియా గడిపేదట్ట... ఆ గడియా తీసేదెట్ట


ఆ ఘడియా రానీకు నన్నిడిసి పోమాకు...
ఆ ఘడియా రానీకు నన్నిడిసి పోమాకు...
తొలి పొద్దు పొడిచిదంటే.. చలి తీరిపోయేదెట్ట...  ఎట్ట..



నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా
తెల్లారిపోయేదెట్టా.. హా.. ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..

నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా





No comments:

Post a Comment