Friday, September 26, 2014

సాగర సంగమమే

చిత్రం  :  సీతాకోకచిలుక (1981)
సంగీతం  :  ఇళయరాజా
గీతరచయిత  : వేటూరి
నేపథ్య గానం  : బాలు,  సుశీల    
 


పల్లవి : 


సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే


సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో...
కలలో ఇలలో.. దొరకని కలయిక 

సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే

చరణం 1 : 


కన్యాకుమారి నీ పదములు నేనే... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కన్యాకుమారి నీ పదములు నేనే


కడలి కెరటమై కడిగిన వేళా
సుమ సుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా


అలిగిన నా పలు అలకలు..
నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా..


సాగర సంగమమే.... ప్రణయ... సాగర సంగమమే 


చరణం 2 :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని.. వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా


పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళా


సాగర సంగమమే... ప్రణయ... సాగర సంగమమే
సాగర సంగమమే....




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7553

No comments:

Post a Comment