Saturday, September 13, 2014

ఓహో.. తద్ధిమి తకఝణు

చిత్రం : బందిపోటు విప్లవ సింహం  (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి 



పల్లవి :

లబుచికు లబుచికు లబుచికు లబుచికు చియ్యారే....

ఓహో.. తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
సిందులెయ్యి మావా కనువిందు సెయ్యి మావా
ఓహో.. తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
సిందులెయ్యి మావా కనువిందు సెయ్యి మావా


ఓహోహో.. ఓహోహో.. ఆహాహా.. ఆహాహా..
సుక్కలన్ని సోకులు మీరే సందమామ పక్కకు చేరే
సుక్కలన్ని సోకులు మీరే సందమామ పక్కకు చేరే


చక్కనైన వేళా..ఆ..ఆ
ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సెయ్యి మావా  


చరణం 1 :


సిటికంత లేత నడుము ఊగిపోతుంటే
సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే
సిటికంత లేత నడుము ఊగిపోతుంటే
సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే


చల్లగాలి శ్రుతిగా చక్కని పిల్లగాలి జతగా
చల్లగాలి శ్రుతిగా చక్కని పిల్లగాలి జతగా
అల్లన మెల్లన గుండెలు ఝల్లన ఆడవోయి మామా..


ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
సిందులెయ్యి మావా.. కనువిందు సెయ్యి మావా


చరణం 2 :


ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది
ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది


కన్నెపిల్ల ఇదిగో వెన్నెల గోరుముద్దలవిగో
కన్నెపిల్ల ఇదిగో వెన్నెల గోరుముద్దలవిగో
చల్లగ మెల్లగ సరసాలాడుతూ ఆరగించు మావా


ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
సిందులెయ్యి మావా కనువిందు సెయ్యి మావా




No comments:

Post a Comment