Monday, October 13, 2014

పారాహుషార్ పారాహుషార్

చిత్రం :  స్వయంకృషి (1987)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


లాలలా ఆహాహా

పారాహుషార్ పారాహుషార్

పారాహుషార్.. పారాహుషార్

తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ

తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ

పారాహుషార్.. పారాహుషార్

 

అంబారి ఏనుగునెక్కి..  అందాల మా యువరాజు

అంబారి ఏనుగునెక్కి..  అందాల మా యువరాజు

ఊరేగుతూ వచ్చెనమ్మ...  పారాహుషార్


పారాహుషార్.. పారాహుషార్


చరణం 1 :


తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు

తూరుపమ్మ.. పారాహుషార్

దుందుడుకు దుండగీడు దిక్కుతోచనీడు

దక్షిణమ్మ.. పారాహుషార్

పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు

పడమరమ్మ.. పారాహుషార్

జిత్తులెన్నో వేస్తాడమ్మ..

జిత్తులెన్నో వేస్తాడమ్మ.. దుత్తలు పడదోస్తాడమ్మ

ఉత్తరమ్మ... ఉత్తరమ్మ...  పారాహుషార్ 

 

 పారాహుషార్.. పారాహుషార్


చరణం 2 :


రేయురంగు లేనివాడు వేయునామాల వాడు

తూరుపమ్మ.. పారాహుషార్

ఏమూలన నక్కినాడో ఆనవాలు చిక్కనీడు

దక్షిణమ్మ... పారాహుషార్

ఓ... ఓ ఓ ఓ ఓ.... హో హో

నోరార రా రా రారా అన్నా మొరాయించుతున్నాడమ్మా
ఆ... పడమరమ్మ పారాహుషార్
ముక్కుతాడు కోసేయాలి... ముట్టెపొగరు తీసేయాలి

ముక్కుతాడు కోసేయాలి... ముట్టెపొగరు తీసేయాలి

ఉత్తరమ్మ... పారాహుషార్


పారాహుషార్... పారాహుషార్


చరణం 3 :


నీలాటిరేవుకాడ నీలమేఘ శ్యాముడు చూడ

అమ్మో.. ఓయమ్మో

నీలాటిరేవుకాడ నీలమేఘ శ్యాముడు చూడ

సల్లనైన ఏటినీరు సలసలమరిగిందమ్మ

అమ్మో...  ఓయమ్మో

సెట్టుదిగని సిన్నోడమ్మ.. బెట్టువదలకున్నాడమ్మ

సెట్టుదిగని సిన్నోడమ్మ... బెట్టువదలకున్నాడమ్మ

అమ్మమ్మో...  ఓయమ్మో

జట్టు కట్ట రమ్మంటుంటే.. పట్టుదొరకక ఉన్నాడమ్మ

అమ్మో ఓయమ్మో...  అమ్మమ్మో...  ఓయమ్మో


తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ

తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ

పారాహుషార్ పారాహుషార్

పారాహుషార్ పారాహుషార్ 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9405

No comments:

Post a Comment