Monday, October 13, 2014

సిగ్గు పూబంతి

చిత్రం :  స్వయంకృషి (1987)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సిరివెన్నెల

నేపథ్య గానం :  బాలు, జానకి, ఎస్. పి. శైలజ


పల్లవి :


సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

మొగ్గ... మొగ్గ... తన... మొగ్గ... మొగ్గ...

మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి...


సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి


చరణం 1 :


విరజాజి పూలబంతి అరసేత మోయలేని

విరజాజి పూలబంతి అరసేత మోయలేని

సుకుమారి ఈ సిన్నదేనా

శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా


ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు

ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు

సూసి అలకలొచ్చిన కలికి

సూసి అలకలొచ్చిన కలికి

ఏసినాది కులుకుల మొలికి


సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి


చరణం 2 :


సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న

సిలకమ్మ కొనసూపు సౌరు.. బొండుమల్లి సెండుజోరు

సేరే ఆ సూపుల తళుకు... ముసురుతున్న రామయ రూపు

సేరే ఆ సూపుల తళుకు... ముసురుతున్న రామయ రూపు

మెరిసే నల్లమబ్బైనాది...

మెరిసే నల్లమబ్బైనాది... వలపు జల్లు వరదైనాది


సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9406

No comments:

Post a Comment