Monday, October 27, 2014

ఊరుకో ఊరుకో బంగారు కొండా

చిత్రం  :  ఆత్మబంధం (1991)

సంగీతం  :  కీరవాణి

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం  :  బాలు, చిత్ర  




పల్లవి :


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేజారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా  


చరణం 1 :




ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా
చల్లబడకుంది ఎడారి ఎదలో..
జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా
మొండి ఊపిరింకా మిగిలుందీ...
చల్లని నీ కళ్ళలో కమ్మని కలనేను
చెమ్మగిల్లనీయకుమా కరిగిపోతానూ


దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేజారిపోయిన జాబిల్లినీ... తేలేని తల్లినీ ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారు కొండా.. నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా 


చరణం 2 : 


గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమనీ
తప్పుపట్టి తిట్టేవారేరీ... తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా
అంటూ ఊరడించే నాన్నేరీ
చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేననీ
జన్మలెన్ని దాటైనా చేరుకుంటాననీ


దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేజారిపోయిన జాబిల్లినీ... తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊ...రుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేజారిపోయిన జాబిల్లినీ... తేలేని తల్లినీ ఏడిపించకుండా



No comments:

Post a Comment