Sunday, December 7, 2014

అమ్మా చూడాలీ

చిత్రం :  పాప౦ పసివాడు (1972)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 





పల్లవి :


అమ్మా చూడాలీ.. నిన్నూ నాన్నను చూడాలీ
నాన్నకు ముద్దు ఇవ్వాలి.. నీ ఒడిలో నిద్దుర పోవాలి.. అమ్మా.. అమ్మా... 


అమ్మా చూడాలీ.. నిన్నూ నాన్నను చూడాలీ
నాన్నకు ముద్దు ఇవ్వాలీ.. నీ ఒడిలో నిద్దుర పోవాలీ
అమ్మా.. అమ్మా..  అమ్మా.. అమ్మా



చరణం 1 :



ఇల్లు చేరే దారే లేదమ్మా.. నిన్ను చూసే ఆశే లేదమ్మా
ఇల్లు చేరే దారే లేదమ్మా.. నిన్ను చూసే ఆశే లేదమ్మా
నడవాలంటే ఓపికలేదు.. ఆకలి వేస్తూంది
అమ్మా.. అమ్మా.. అమ్మా.. అమ్మా



చరణం 2 :



పలికేందుకు  మనిషేలేడూ..  నిలిచేందుకు   నీడేలేదూ
పలికేందుకు  మనిషేలేడూ.. నిలిచేందుకు   నీడేలేదూ
బాధగవుంది భయమేస్తూంది ప్రాణం లాగేస్తుంది..  అమ్మా.. అమ్మా



అమ్మా చూడాలీ నిన్నూ నాన్నను చూడాలీ
నాన్నకు ముద్దు ఇవ్వాలి..  నీ ఒడిలో నిద్దుర పోవాలి
అమ్మా.. అమ్మా..  అమ్మా.. అమ్మా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6520

No comments:

Post a Comment