Saturday, December 27, 2014

జిలిబిలి సిగ్గుల చిలకను

చిత్రం  :  అమెరికా అమ్మాయి (1976)
సంగీతం  :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం  :  బాలు, వాణిజయరాం 



పల్లవి : 


జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగుల తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
ఓ... ఓ... ఓ.. బెదురుచు చేరెను చిలకమ్మా




చరణం 1 :


కొండల కోనల కోయిల పాడెను సంగీతం
కొండల కోనల కోయిల పాడెను సంగీతం
మధువులు ఆనుచు.. మత్తుగ పాడుచు.. తుమ్మెద ఆడేను సల్లాపం...


జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా
అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా



చరణం 2 :


పచ్చని పసరిక పానుపు పరిచెను పోదరి౦ట్లో
పచ్చని పసరిక పానుపుపరిచెను పోదరి౦ట్లో
వెచ్చనివలపుల ముచ్చట తీరగ తనువులు కరిగెను కౌగిట్లో

ఓ.. ఓ.. జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా 

అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా
బెదురుచు చేరెను చిలకమ్మా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4721

No comments:

Post a Comment