Sunday, December 7, 2014

వయసే ఒక పూలతోట

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల, రామకృష్ణ 





పల్లవి :


వయసే ఒక పూలతోట.. వలపే ఒక పూలబాట
ఆ తోటలో ఆ బాటలో.. పాడాలి తియ్యని పాట..పాడాలి తియ్యని పాట


వయసే ఒక పూలతోట.. వలపే ఒక పూలబాట
ఆ తోటలో ఆ బాటలో.. పాడాలి తియ్యని పాట.. పాడాలి తియ్యని పాట  
 



చరణం 1 :



పాల బుగ్గలు ఎరుపైతే హో.. హో.. లేత సిగ్గులు ఎదురైతే
పాల బుగ్గలు ఎరుపైతే హో..  హో.. లేత సిగ్గులు ఎదురైతే


రెండు మనసులు ఒకటైతే.. పండు వెన్నెల తోడైతే
రెండు మనసులు ఒకటైతే.. పండు వెన్నెల తోడైతే


కోరికలే తీరేనులే.. పండాలి వలపుల పంట.. పండాలి వలపుల పంట


చరణం 2 :


నీ కంటి కాటుక చీకటిలో..  పగలు రేయిగ మారెనులే
నీ కంటి కాటుక చీకటిలో.. పగలు రేయిగ మారెనులే 


నీ కొంటెనవ్వుల కాంతులలో.. రేయి పగలైపొయెనులే
నీ కొంటెనవ్వుల కాంతులలో.. రేయి పగలైపొయెనులే


నీ అందము నా కోసమే.. నీ మాట.. ముద్దుల మూట.. 

నీ మాట.. ముద్దుల మూట 





చరణం 3 :



పొంగిపొయే పరువాలు హో మింగినంటే కెరటాలు
పొంగిపొయే పరువాలు ఆ.. మింగినంటే కెరటాలు


చేరుకున్నవి తీరాలు.. లేవులే ఇక దూరాలు
చేరుకున్నవి తీరాలు.. లేవులే ఇక దూరాలు
ఏనాటికి మన మొక్కటే ఒక మాట ఇద్దరి నోట.. ఒక మాట ఇద్దరి నోట


వయసే ఒక పూలతోట.. వలపే ఒక పూలబాట..
ఆ తోటలో ఆ బాటలో పాడాలి తియ్యని పాట.. పాడాలి తియ్యని పాట




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1751

No comments:

Post a Comment