Thursday, December 4, 2014

ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ

చిత్రం : రామరాజ్యం (1973)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, బాలు



పల్లవి :


ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ.. ఎందుకండీ ఇంతలోనే కంగారూ

ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ..  ఎందుకండీ ఇంతలోనే కంగారూ

అయ్యో రామా..  అయ్యో రామా

గుళ్లోనీ మాట వింటె అమ్మాయిగారూ
గుండెల్లో గుబులేసింది బొమ్మయ్ గారూ
అయ్యో రామా . . . అయ్యో రామా  




చరణం 1 :


పిల్లా పాపా కలగాలనీ.. చల్లని దీవెన వినలేదా
ఆ దీవెన వింటూ ఔనంటూ కోవెల గంటలు అనలేదా


పిల్లలు వద్దంటానా.. ఈ పిల్లను కాదంటానా
ఆ పెళ్ళికానిదే ఏలాగనీ.. తల్లకిందు లౌతున్నానమ్మీ    


  
ఏమండీ లేతబుగ్గల లాయర్ గారూ.. ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యో రామా.. అయ్యో రామా
అయ్యో రామా.. అయ్యో రామా 



చరణం 2 :



మొన్నటి కలలో పిలిచావు.. ముద్దులు యిమ్మని అడిగావు
మరి తోడుగ సాగే ఈ వేళ.. ఆడపిల్లలా బెదిరేవు
ముద్దులు వద్దంటానా.. ఆ ముచ్చట కాదంటానా
మన పెద్దల తీర్పువినాలనీ.. ఒద్దికగా వేచి వున్నానమ్మీ   


  
ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ.. ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యో రామా.. అయ్యో రామా
అయ్యో రామా.. అయ్యో రామా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7285

No comments:

Post a Comment