Monday, December 29, 2014

చెప్పాలనుకున్నానూ

చిత్రం :  దొరలు దొంగలు (1976)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మల్లెమాల
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :



చెప్పాలనుకున్నానూ.. చెప్పలేకపోతున్నానూ..
చెప్పాలనుకున్నానూ.. చెప్పలేకపోతున్నానూ
కల్లాకపటం తెలియని నన్ను.. కన్నులతో కవ్వి౦చవద్దని
చెప్పాలనుకున్నానూ..  చెప్పలేకపోతున్నానూ


చెప్పకుండ నా మదిలో దూరి..
చిందర వందర చెయ్యొద్దని.. రె౦డివ్వాలనుకున్నానూ
రె౦డివ్వాలనుకున్నానూ.. ఇవ్వలేక పోతున్నానూ



చరణం 1 :


ఆడుకునే లతల నడుమ.. పాడుకునే పూవులమై
ఆడుకునే లతల నడుమ..  పాడుకునే పూవులమై
పరిసరాల నన్నిటిని పరిమళింప చేద్దామని
పరిమళింప చేద్దామని... నే 
చెప్పాలనుకున్నానూ..  చెప్పలేకపోతున్నానూ




చరణం 2 :



మేలి ముసుగులోని లజ్జ..  మెట్లు దిగీ వచ్చిందని

మేలి ముసుగులోని లజ్జ..  మెట్లు దిగీ వచ్చిందని

తెలిసికూడా తెలియనట్లే.. ఒదిగుంటే ఒళ్ళుమండి

ఒదిగుంటే ఒళ్ళుమండి.. రె౦డివ్వాలనుకున్నానూ.. ఇవ్వలేక పోతున్నానూ



చరణం 3 :



అడగకుండ అందించే..  ఆలి౦గన మధురము
అడగకుండ అందించే..  ఆలి౦గన మధురము


వద్దంటూ అందుకునే.. వలపు మరీ మధురము



అని చెప్పాలనుకున్నాను.. అన్నీ చెప్పేశాను
ఇవ్వాలనుకున్నాను.. అన్నీ ఇచ్చేశాను





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4611

No comments:

Post a Comment